ICC World Cup : ఐసీసీ వరల్డ్ కప్ టీమ్ ప్రకటన.. ఆరుగురు భారత ఆటగాళ్ళకు చోటు
అభిమానులను అలరించిన టీ ట్వంటీ ప్రపంచకప్ లో టీమిండియా విజేతగా నిలిచింది. ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ కు దూసుకొచ్చి సౌతాఫ్రికాను ఓడించి సగర్వంగా ట్రోఫీ అందుకుంది.

ICC World Cup Team Announcement.. Place for six Indian players
అభిమానులను అలరించిన టీ ట్వంటీ ప్రపంచకప్ లో టీమిండియా విజేతగా నిలిచింది. ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ కు దూసుకొచ్చి సౌతాఫ్రికాను ఓడించి సగర్వంగా ట్రోఫీ అందుకుంది. దాదాపు జట్టులో ప్రతీ ప్లేయర్ ఒక్కో మ్యాచ్ లో రాణించి ఈ చారిత్రక విజయంలో భాగమయ్యారు. టోర్నీ ముగియడంతో ఐసీసీ వరల్డ్ కప్ బెస్ట్ ఎలెవన్ ను ప్రకటించింది. దీనిలో భారత్ నుంచి ఆరుగురు ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు. అయితే స్టార్ ప్లేయర్ కోహ్లీకి మాత్రం చోటు దక్కలేదు.
ఐసీసీ టీమ్ కు ఎంపికైన భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. సంచలన ప్రదర్శనలతో సెమీఫైనల్స్‌కు దూసుకొచ్చిన అఫ్గానిస్థాన్ నుంచి ముగ్గురు ప్లేయర్లు ఎంపికయ్యారు. అఫ్గాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ రషీద్ ఖాన్, ఫరూఖీ చోటు దక్కించుకున్నారు. రన్నరప్ గా నిలిచిన సౌతాఫ్రికా నుంచి ఒక్కరికీ ఛాన్స్ దక్కలేదు. 12వ ఆటగాడిగా నోర్జే ఒక్కడే ఎంపికయ్యాడు. ఆసీస్ నుంచి స్టోయినిస్ , విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ఎంపికయ్యారు.