ICC WORLD CUP: నిలకడగా ఆడుతున్న టీమిండియా
టీమిండియా జట్టు నిలకడగా ఆడుతోంది. విరాట్ కోహ్లీ మరో ఫిఫ్టీ కొట్టాడు.
ICC WORLD CRICKET CUP: అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఆచి తూచి ఆడుతోంది. 3 వికెట్లు కోల్పోవడంతో ప్రస్తుతం విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సింగిల్స్ తో స్కోరును క్రమంగా పెంచుతున్నారు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టగంగా బౌలింగ్ చేస్తుండటంతో పెద్దగా రిస్క్ చేయడం లేదు. బౌండరీలు కూడా కొట్టడం లేదు. పైగా ఆస్ట్రేలియా క్రికెటర్లు పకడ్బందీగా ఫీల్డింగ్ చేస్తున్నారు. దాంతో ఎక్కడా కూడా ఫోర్ కి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు. విరాట్ కోహ్లీ 50 పరుగులు చేశారు. గంటకు పైగా ఒక్క ఫోర్ కూడా గిల్, కోహ్లీ కొట్టలేకపోయారంటే ఆసీస్ బౌలర్ల బౌలింగ్ ను అర్థం చేసుకోవచ్చు. తర్వాత 90 బౌల్స్ తర్వాత కేఎల్ రాహుల్ ఫోర్ కొట్టాడు.