Sachin Tendulkar: సచిన్ బ్యాట్ బరువు ధోని బ్యాట్ బరువు
క్రికెట్‌లో ప్రతి పరుగుకీ విలువ ఉంటుంది. ఒక్కపరుగు తేడాతో మ్యాచ్ ఫలితం మారిపోయిన సందర్భాలు వందలో సంఖ్యలోనే ఉన్నాయి.

If the players of today's generation are interested in using light bats.. Sachin created records with heavy bats
అయితే బ్యాటర్ ఒక్క పరుగు చేయాలన్నా, బౌండరీ లేదా సిక్సర్ బాదాలన్నా అతని చేతిలోని బ్యాట్ తనకు అనుకూలమైనదిగా ఉండాలి. ఈ కారణంగానే కోహ్లీ సహా ఎందరో క్రికెటర్లు తేలికపాటి బ్యాట్లను వాడతారు. అయితే కొందరు ఇందుకు పూర్తి విరుద్దం. క్రికెట్ చరిత్రలో అత్యంత బరువైన బ్యాట్‌తో ఆడిన ఆటగాడిగా 100 సెంచరీల సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ ఒకానొక సమయంలో ఎంఆర్ఎఫ్, అడిడాస్ కంపెనీకి చెందిన 1.47 కిలోల బ్యాట్‌ను ఉపయోగించాడు. యూనివర్సల్ బాస్, సిక్సర్ల సామ్రాట్, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. గేల్ కూడా ఒకానొక సమయంలో స్పార్టన్ సీజీ కంపెనీకి చెందిన 1.36 కిలోల బ్యాట్‌ని ఉపయోగించాడు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 2008లో దక్షిణాఫ్రికాపై 1.35 కిలోల ఎస్ జీ బ్యాట్ ఉపయోగించి 319 పరుగులు చేశాడు. కూల్ కెప్టెన్‌గా ప్రఖ్యాతి గాంచిన ఎంఎస్ ధోని 1.27 కిలోల స్పార్టన్ బ్యాట్‌ను ఉపయోగించాడు. ప్రత్యర్థులను కంగారు పెట్టించే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. వార్నర్ మామ 1.24 కిలోల బ్యాట్‌ని ఉపయోగిస్తాడు.