Team India : గిల్ సెల్ఫిష్ నెస్ వద్దు.. భారత కెప్టెన్ పై ఫ్యాన్స్ ఆగ్రహం
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శుభ్ మన్ గిల్ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. గిల్ లాంటి స్వార్థపరుడుని ఎక్కడా చూడలేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

In front of Gill's selfishness, fans are angry with the Indian captain
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శుభ్ మన్ గిల్ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. గిల్ లాంటి స్వార్థపరుడుని ఎక్కడా చూడలేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. జింబాబ్వేతో నాలుగో టీ ట్వంటీలో భారత్ వికెట్ నష్టపోకుండా 153 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. ఛేజింగ్ లో జైశ్వాల్ దూకుడుగా ఆడితే… గిల్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే విజయానికి 18 పరుగులు కావాల్సి ఉండగా.. జైశ్వాల్ సెంచరీకి 17 పరుగుల దూరంలో ఉన్నాడు. అదే సమయంలో గిల్ కూడా హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత జైశ్వాల్ కు స్ట్రైకింగ్ ఇవ్వకుండా సిక్సర్ కొట్టడంతో భారత్ విజయానికి చేరువైంది.
తర్వాత సింగిల్ తీసి ఇవ్వగా జైశ్వాల్ కూడా సిక్సర్ కొట్టినా 93 పరుగులే చేయగలిగాడు. దీంతో సెంచరీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. గిల్ స్వార్థం కారణంగానే అతను శతకం చేయలేకపోయాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిఫ్లీ తర్వాత సింగిల్ తీసి ఇచ్చి ఉంటే జైశ్వాల్ సెంచరీ పూర్తయ్యేదని చెబుతున్నారు.గిల్ మాత్రం తానే మ్యాచ్ ను ముగించాలన్న కారణంతో ఆడాడంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం గిల్ పై సోషల్ మీడియాలో సెల్ఫిష్ నెస్ అంటూ ట్రోలింగ్ నడుస్తోంది.