Sunny Leone: పెద్ద మనసును చాటుకున్న సన్నీ లియోన్ ఎవరు గొప్ప అనే ప్రశ్నకు కిరాక్ సమాధానం
ప్రపంచ వ్యాప్తంగా సన్నీ లియోన్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన హాట్ లుక్స్ తో, ఎక్స్ పోజింగ్ తో కుర్రకారుని పిచ్చెక్కించింది.

In his own style, Sunny Leone responded on social media by posting a photo of Sunil Chhatri, who scored the most goals in international football
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాకి కాస్త దూరంగా ఉన్న ఈ అమ్మడు తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫుట్ బాల్ క్రీడలో మీకు మెస్సీఇష్టమా? రోనాల్డో ఇష్టమా అనే ప్రశ్న ఎదరైంది. అయితే అందరిలా నాకు మెస్సీ అంటే ఇష్టమనో, లేక రొనాల్డో నా ఫెవరెట్ ఫుట్‌బాలర్ అని చెప్పకుండా సర్‌ప్రైజింగ్ ఆన్సర్ ఇచ్చింది సన్నీ.
‘మనవాడు సునీల్ ఛెత్రీ ఉన్నాడుగా..’ అంటూ సునీల్ ఛెత్రీ ఫోటోను పోస్ట్ చేసింది సన్నీ లియోన్. ఈ పోస్టుతో అభిమానులను ఇంప్రెస్స్ అవ్వగా.. ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సౌతా ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ గోల్స్ సాధించిన భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ, అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆల్‌టైం ఫుట్‌బాల్ ప్లేయర్లలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. మొత్తానికి ఎవ్వరు ఊహించని ఆన్సర్ ఇచ్చిన సన్నీ.. స్పోర్ట్స్ పై తనకున్న అవగాహనను తెలుపుతూనే దేశం మీద అభిమానం చాటుకుంది.