Harthik Pandya: పాండ్యా కెప్టెన్సీ లోపాలు
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో పోరాడినా కూడా టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ ఓటమితో ఐదు టీ20ల సిరీసులో భారత జట్టు 0-2 తేడాతో వెనుక బడింది.
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఛేజింగ్ ఆరంభమైన తర్వాత భారత్ గెలుపు కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ చాహల్ వేసిన ఒక్క ఓవర్ ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అతని ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. అలాగే మరో బ్యాటర రనౌట్ అయ్యాడు. అది అతని మూడో ఓవర్ మాత్రమే. దీంతో నాలుగో ఓవర్లో ఏం చేస్తాడని అంతా ఎదురు చూశారు. కానీ పాండ్యా మాత్రం చాహల్‌కు మళ్లీ బంతిని అందించలేదు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా చేసిన మరో పెద్ద తప్పు అక్షర్ పటేల్‌ను ఆడించడం. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్ కోసం అతన్ని తీసుకున్న పాండ్యా.. ఈ మ్యాచ్‌లో ఒక్కసారి కూడా అక్షర్‌కు బంతి ఇవ్వలేదు. ఇదిలా ఉంటే, విండీస్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అకీల్ హుస్సేన్ రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. అలాంటి పిచ్‌పై అక్షర్ మరింత రాణించేవాడే. కానీ పాండ్యా మాత్రం తన చెత్త నిర్ణయంతో అతనికి బౌలింగ్ ఇవ్వలేదు.