Pat Cummins : కమిన్స్ సరికొత్త చరిత్ర…
ఐపీఎల్ క్వాలిఫయిర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌పై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారిగా ఫైనల్‌కు దూసుకెళ్లింది.

In IPL Qualifier-2, Sunrisers Hyderabad were defeated.
ఐపీఎల్ క్వాలిఫయిర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌పై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారిగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సన్ రైజర్స్ ను విజయవంతంగా నడిపిస్తున్న ప్యాట్ కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు. ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో కెప్టెన్‌గా కమిన్స్ చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో షేన్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2008 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్సీ చేసిన వార్న్ 19 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతి స్థానాల్లో 17 వికెట్లతో కమిన్స్ , అనిల్ కుంబ్లే ఉండగా…15 వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్ధానంలో నిలిచాడు. మరో మ్యాచ్ మిగిలి ఉన్న నేపథ్యంలో షేన్ వార్న్ రికార్డును కమిన్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. కాగా టైటిల్ కోసం ఆదివారం జరిగే తుదిపోరులో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.