Mahendra Singh Dhoni : ధోనీ మరో రికార్డ్..

ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌లో బ్యాటింగ్‌ పరంగా ధోనీ మెరుపులు అంతగా చూడలేకపోతున్నా కీపర్‌గా మాత్రం సత్తా చాటుతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 6, 2024 | 05:00 PMLast Updated on: May 06, 2024 | 5:00 PM

In Terms Of Batting In The 17th Season Of Ipl Dhoni Is Not Able To See The Flashes But He Is Showing His Ability As A Keeper

ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌లో బ్యాటింగ్‌ పరంగా ధోనీ మెరుపులు అంతగా చూడలేకపోతున్నా కీపర్‌గా మాత్రం సత్తా చాటుతున్నాడు. వికెట్ల వెనుక ఎప్పటిలానే అద్భుతమైన క్యాచ్‌లతో అదరగొడుతున్నాడు. వయసు పెరిగినా ధోనీలో కీపింగ్ స్కిల్స్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ (Mahendra Singh Dhoni) ధోనీ అరుదైన రికార్డు సాధించాడు. జితేశ్ శర్మ (Jitesh Sharma) ఇచ్చిన క్యాచ్ అందుకోవడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఈ మెగా లీగ్‌లో ధోనీ 150 క్యాచ్‌లతో పాటు 42 స్టంపింగ్స్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు, స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్ల జాబితాలో ధోనీ తర్వాతి స్థానంలో దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) ఉన్నాడు. దినేశ్ కార్తీక్ 141 క్యాచ్‌లు, 36 స్టంపింగ్స్ చేశాడు. వృద్ధిమాన్ సాహా 141 క్యాచ్‌లు, 36 స్టంపింగ్స్ చేయగా.. రిషభ్ పంత్ 75 క్యాచ్‌లు, 21 స్టంపింగ్స్, రాబిన్ ఉతప్ప 57 క్యాచ్‌లు, 33 స్టంపింగ్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్‌లో కెప్టెన్సీ వదిలేసిన ధోనీ చివరి ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్‌కు వస్తున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో మాత్రం డకౌటై అభిమానులను నిరాశపరిచాడు.