Sunrisers Hyderabad : ఇలా ఆడితే బౌలర్లు ఏమైపోవాలి…
ఐపీఎల్ 17వ సీజన్ లో అన్ని జట్ల బ్యాటింగ్ ఒకలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మాత్రం మరోలా ఉంది. బౌలర్లకు దడ పుట్టిస్తోంది. పిచ్ ఎలా ఉన్నా చెలరేగి ఆడుతోంది.
ఐపీఎల్ 17వ సీజన్ లో అన్ని జట్ల బ్యాటింగ్ ఒకలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మాత్రం మరోలా ఉంది. బౌలర్లకు దడ పుట్టిస్తోంది. పిచ్ ఎలా ఉన్నా చెలరేగి ఆడుతోంది. ప్రత్యర్ధి మంచి స్కోరు టార్గెట్ గా పెట్టినా వాటర్ తాగినంత ఈజీగా చేదీస్తోంది. తాజాగా లక్నో సూపర్ జయింట్స్ తో మ్యాచ్ లో విధ్వంసమే దీనికి ఉదాహరణ. లక్నో బ్యాటర్లు తడబడిన పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి బంతి నుంచే ధాటిగా ఆడారు. పోటాపడి బౌండరీలు బాదారు. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లోనే 89 పరుగులతో అద్భుత హిట్టింగ్ చేశాడు. అర్ధ శకతంతో కుమ్మేశాడు. అభిషేక్ శర్మ కూడా తన మార్క్ హిట్టింగ్‍తో సునామీ సృష్టించాడు. హెడ్, అభిషేక్ దూకుడుతో సన్ రైజర్స్ 5.4 ఓవర్లలోనే 100 రన్స్ , 9.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 167 పరుగుల టార్గెట్ ను అందుకుంది.ఇలా ఆడితే బౌలర్లు ఏమై పోవాలి అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.