Krunal Pandya : ఈ సీజన్ సిక్సర్లదే
ప్రస్తుత ఐపీఎల్ (IPL) సీజన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా సిక్సర్ల మోత మోగుతుంది. ఈ సీజన్ మరో 18 మ్యాచ్‌లు మిగిలుండగానే 1000 సిక్సర్ల అత్యంత అరుదైన మైలురాయిని తాకింది.

ప్రస్తుత ఐపీఎల్ (IPL) సీజన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా సిక్సర్ల మోత మోగుతుంది. ఈ సీజన్ మరో 18 మ్యాచ్‌లు మిగిలుండగానే 1000 సిక్సర్ల అత్యంత అరుదైన మైలురాయిని తాకింది. సన్‌రైజర్స్ (Sunrisers) , లక్నో (Lucknow Supergiants) మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా (Krunal Pandya) కొట్టిన సిక్సర్‌తో ఈ సీజన్‌లో 1000 సిక్సర్లు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని చేరుకునే క్రమంలో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. వెయ్యి సిక్సర్ల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న సీజన్‌గా ఐపీఎల్ 2024 సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఐపీఎల్ చరిత్రను చూస్తే 2022లో 1062 సిక్సర్లు , 2023లో 1124 సిక్సర్లు, 2024 సీజన్లలో మాత్రమే 1000కి పైగా సిక్సర్లు నమోదు కాగా.. ఈ సీజన్‌లోనే అత్యంత వేగంగా ఆ మార్కు తాకింది. 2022 సీజన్‌లో ఈ మార్కును తాకేందుకు 16269 బంతులు అవసరమైతే.. గత సీజన్‌లో 15390 బంతులు.. ఈ సీజన్‌లో అన్నిటికంటే తక్కువగా 13079 బంతుల్లోనే వెయ్యి సిక్సర్లు పూర్తయ్యాయి.