SRH, Kavya : ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో.. కావ్య మాటలకు SRH ప్లేయర్ల కన్నీళ్లు..
ఐపీఎల్ 2024లో విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో అద్భుతాలు క్రియేట్ చేసిన సన్‌రైజర్స్.. ఫైనల్లో బొక్కాబోర్లా పడింది. కోల్‌కతా చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

In the dressing room after the defeat.. SRH players shed tears for Kavya's words..
ఐపీఎల్ 2024లో విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో అద్భుతాలు క్రియేట్ చేసిన సన్‌రైజర్స్.. ఫైనల్లో బొక్కాబోర్లా పడింది. కోల్‌కతా చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఫస్ట్ పవర్ ప్లేలోనే వంద రన్స్ ఈజీగా చేసి రికార్డుల మోత మోగించిన సన్ రైజర్స్… ఫైనల్‌లో మాత్రం తుస్సుమనిపించింది. కోల్‌కతాకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన సన్‌రైజర్స్.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీన్ని పరాజయం కంటే పరాభవంగానే భావించిన SRH ఓనర్ కావ్య మారన్.. మ్యాచ్ పూర్తి అయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐతే అంత బాధలోనూ ఆటగాళ్లను.. కావ్య మారన్ ఓదార్చిన తీరు ఇప్పుడు హైలైట్‌గా మారింది. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిన కావ్య మారన్… నిరుత్సాహంతో ఉన్న తమ ఆటగాళ్లలో జోష్ నింపే ప్రయత్నం చేసింది. మమ్మల్ని మీరు గర్వించేలా చేశారని.. టీ20 క్రికెట్ ఆడే విధానాన్ని కొత్తగా చూపించారని.. కోల్‌కతా కప్ గెలిచినా.. ఐపీఎల్‌లో ప్రతీ ఒక్కరూ సన్ రైజర్స్ గురించి మాట్లాడుకుంటున్నారని.. టోర్నీలో ఎంతో చక్కగా ఆడారని.. మళ్లీ కలుద్దాం.. జాగ్రత్త అంటూ ఆటగాళ్లను ఓదార్చారు కావ్య. లాస్ట్ సీజన్‌లో చివరి స్థానంలో నిలిచినా.. ఈ సీజన్‌లో అభిమానులు పెద్ద సంఖ్యలో మైదానాలకు వచ్చారంటే… అది మీ వల్లేనని.. కేకేఆర్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచినా.. ప్రతి ఒక్కరూ సన్ రైజర్స్ గురించి మాట్లాడుకుంటున్నారుని..
ఇక ముందు కూడా సన్ రైజర్స్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారన్న నమ్మకం ఉందంటూ.. ఆటగాళ్లలో ఉత్సాహం నింపారు కావ్య. ఎవరూ నిరుత్సాహపడొద్దని.. మనం ఫైనల్స్ వరకు వచ్చాం… ఇది కూడా ఇతర మ్యాచ్‌ల్లాంటిదే.. అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు… థ్యాంక్యూ అంటూ.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి వెళ్లిపోయారు కావ్య. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావ్య మాటలకు నెటిజన్లు ఫిదా అంటున్నారు.