దండాలయ్యా వృద్ధిమాన్ సాహా చరిత్రలో ఎవ్వడు నీలా ఆలోచించలేదు

టీమిండియా వెటరన్ కీపర్ వృద్దిమాన్ సాహాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. కుర్రాళ్ల కోసం ఈ వెటరన్ వికెట్ కీపర్ గొప్ప అవకాశాన్ని వదులుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టులో వికెట్ కీపర్‌గా సాహాకే అవకాశం ఇచ్చినా.. అతను సున్నితంగా తిరస్కరించినట్లు త్రిపుర సెలెక్టర్ జయంత్ దే తెలిపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 17, 2023 | 05:31 PMLast Updated on: Jun 17, 2023 | 5:31 PM

In The Duleep Trophy Wriddiman Saha Politely Turned Down An Opportunity To Give Another Player In The Bengal Team A Chance To Represent Him

దులీప్ ట్రోఫీ అనేది భారత జట్టులోకి వద్దామనే యువ ఆటగాళ్ల కోసం నిర్వహించే టోర్నీ అని, తాను భారత్‌కు ఆడనప్పుడు ఆ స్థానంలో మరో యువకుడికి అవకాశం ఇస్తే బాగుంటుందని సాహా సూచించాడని జయంత్ దే చెప్పుకొచ్చారు. సాహా మాటలు తమను కదిలించాయని చెప్పాడు. దులీప్ ట్రోఫీ బరిలోకి దిగే ఈస్ట్ జోన్ జట్టు వివరాలను శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా సాహా గురించి జయంత్ దే ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘తొలుత వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను తీసుకోవడానికి ఈస్ట్‌జోన్ సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపగా.. అతను ఆడేందుకు ఆసక్తిగా లేనని చెప్పడంతో సెలెక్టర్లు డైలామాలో పడ్డారు.

దీంతో సీనియర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాను సంప్రదించారు. అయితే అతను సున్నితంగా తిరస్కరించడంతో బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌కు అవకాశం ఇచ్చారు.వృద్దిమాన్ సాహా నిజాయితీ అద్భుతం. తప్పకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. సాహా చెప్పిన మాటలు మమ్మల్ని కదిలించాయి. దులీప్ ట్రోఫీ అనేది భారత జట్టులోకి వద్దామనే యువ ఆటగాళ్ల కోసం నిర్వహించే టోర్నీ.

తాను భారత్‌కు ఆడనప్పుడు ఆ స్థానంలో మరో యువ ఆటగాడికి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పాడు.’అని జయంత్‌దే తెలిపాడు. ఎంగిలి విస్తరే ఎగిరెగిరి పడుతుంది, షడ్రుచుల భోజనం నిండిన విస్తరి ఒద్దికగా ఉంటుంది అనే సామెత వృద్ధిమాన్ సాహా గొప్పతనాన్ని మరోసారి వ్యక్తం చేస్తుంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఓపెనర్ గా తనదైన బాధ్యతలు నిర్వర్తించిన ఈ సూపర్ సీనియర్, ఫీల్డ్ లోనే కాదు, ఇలాంటి గొప్ప విషయాలను పబ్లిసిటీ చేసుకోవడంలో కూడా సైలెంట్ అని తెలుస్తుంది. విషయం తెలిసిన భారత క్రికెట్ అభిమానులు, చరిత్రలో నీలాంటి క్రికెటర్ ఉండడు, గొప్ప నిర్ణయాలు తీసుకోవాలంటే, గొప్ప మనసు ఉండాలి అంటూ, సాహాను ఆకాశానికెత్తుతున్నారు.