ABD Dewald Brevis: డివిలియర్స్ కొడుకు దూకుడు ఫైనల్స్ లో ముంబై ఇండియన్స్
మేజర్ లీగ్ క్రికెట్‌తొలి ఎడిషన్‌లో ముంబై న్యూయార్క్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ లీగ్‌లో భాగంగా భారత కాలామాన ప్రకారం శనివారం తెల్లవారుజామున టెక్సస్ సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఛాలెంజర్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది.

In the first edition of Major League Cricket, Mumbai won the challenger against Texas Super Kings by 6 wickets
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. న్యూయర్క్ జట్టు లక్ష్య ఛేదనలో ఆ జట్టు యువ ఆటగాడు, జూనియర్ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్ సాయంతో 41 పరుగుల చేసి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో బౌల్ట్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. టిమ్ డేవిడ్ రెండు, ఇషాన్ అదిల్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. ఇక ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో సీటెల్ ఓర్కాస్,ముంబై న్యూయార్క్ జట్లు అమీ తుమీ తెల్చుకోనున్నాయి.