Ravindra Jadeja : జడేజా రికార్డుల జోరు…
పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ (IPL) లో సీఎస్‌కే తరపున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా జడ్డూ నిలిచాడు.

In the match against Punjab Kings, Chennai Super Kings star all-rounder Ravindra Jadeja set many records in his account.
పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ (IPL) లో సీఎస్‌కే తరపున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా జడ్డూ నిలిచాడు. జడేజా ఇప్పటివరకు 16 సార్లు మ్యాన్ ఆఫ్‌ది అవార్డులను గెలుచుకున్నాడు. గతంలో ఈ రికార్డు చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోనీ 15 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
తాజా మ్యాచ్‌తో ధోని (Dhoni) రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. అదేవిధంగా మరో రికార్డును కూడా జడ్డూ సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 40 పైగా పరుగులు, 3 వికెట్లు తీసిన ప్లేయర్‌గా యువరాజ్ సింగ్, షేన్ వాట్సన్ సరసన జడేజా నిలిచాడు. జడేజా ఇప్పటివరకు మూడు సార్లు 40 ప్లస్ స్కోర్, 3 వికెట్లు తీశాడు. యువీ, వాట్సన్ కూడా మూడు సార్లు 40 ప్లస్ స్కోర్, 3 వికెట్లు తీశారు. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టింది. పంజాబ్‌పై 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. కీలక బౌలర్ పతిరణ గాయంతో దూరమైనప్పటకి చెన్నై జట్టులో మిగిలిన బౌలర్లు సమిష్టిగా రాణించి విజయాన్ని అందించారు.