IND Vs ENG: రెండో టెస్టులో భారత్ ఘనవిజయం.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా
కొంతకాలంగా, వరుసగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొన్న గిల్.. రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో దారిలోకొచ్చాడు. బౌలర్లలో బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి.. ఇంగ్లండ్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు.
IND Vs ENG: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 106 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. దీంతో మొదటి టెస్టు ఓటమికి భారత్.. ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. రెండో టెస్టు, నాలుగో రోజే.. భారత్ విజయం సాధించడం విశేషం. భారత్.. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. మొదటి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ డబుల్ సెంచరీ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించాడు.
MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు.. సుప్రీంకోర్టులో విచారణ 16కు వాయిదా..?
కొంతకాలంగా, వరుసగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొన్న గిల్.. రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో దారిలోకొచ్చాడు. బౌలర్లలో బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి.. ఇంగ్లండ్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 396 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన 253 పరుగులకు ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 255 పరుగులు చేసి ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ సెంచరీ సాధించాడు. అనంతరం 399 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 292 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇండియా 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే చేసిన 73 పరుగులే అధికం. మిగతా బ్యాటర్లు ఎవరూ అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయారు. ఇక భారత బౌలింగ్‌లో బుమ్రా 3 వికెట్లు తీయగా, రవి చంద్రన్ అశ్విన్ కూడా మరో మూడు వికెట్లు తీశాడు. ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది.
అశ్విన్ రికార్డు..
ఈ టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు చంద్రశేఖర్ పేరిట ఉండేది. చంద్రశేఖర్ 38 ఇన్నింగ్స్‌ల్లో 95 వికెట్లు పడగొట్టారు. అశ్విన్ 38 ఇన్నింగ్స్‌ల్లో 96 వికెట్లతో ఆ రికార్డును బద్దలుకొట్టాడు. వీరిద్దరి తరువాత 92 వికెట్లతో అనిల్ కుంబ్లే మూడో స్థానంలో ఉన్నాడు.