IND VS ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నెగ్గిన భారత్.. 3-1తో సిరీస్ కైవసం..
విజయానికి మరో 72 పరుగులు అవసరమైన దశలో జట్టును గిల్, జురెల్ ఆదుకున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది.
IND VS ENG: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. నాలుగో టెస్టులో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒక దశలో 5 వికెట్లు కోల్పోయి కాస్త తడబడినా.. తర్వాత పుంజుకుని లక్ష్యాన్ని ఛేదించింది. శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్ నిలకడైన ఆటతీరుతో భారత్ విజయం సాధించింది.
Ravichandran Ashwin: రోహిత్ కెప్టెన్సీ అతనికిస్తే బాగుంటుంది.. గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
విజయానికి మరో 72 పరుగులు అవసరమైన దశలో జట్టును గిల్, జురెల్ ఆదుకున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. నాలుగో టెస్టులో విజయానికి భారత లక్ష్యం 192. ఓవర్ నైట్ స్కోరు 40/0తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు విజయం సులభమే అనుకున్నారు. 84 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా పడలేదు. అయితే, భారత్ 84 పరుగుల వద్ద యశస్వి జైశ్వాల్ (37), 99 పరుగుల వద్ద రోహిత్ శర్మ (55) ఔటయ్యారు. ఆ తర్వాత రజత్ పటీదార్ (0), రవీంద్ర జడేజా (4), సర్ఫరాజ్ ఖాన్ (0)లు స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు. రోహిత్ శర్మను టామ్‌హార్డ్లీ ఔట్ చేయగా, రజత్ పాటిదార్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత్.. విజయానికి ఇంకా 72 పరుగుల దూరంలో ఉంది. ఈ సమయంలో క్రీజులో ఉన్న స్పెషలిస్టు బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్‌లు మాత్రమే. వీరిద్దరూ ఔటైతే.. భారత విజయం కష్టమయ్యేది. కానీ, శుభ్‌మన్ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39) వికెట్ కోల్పోకుండా, నిలకడగా ఆడుతూ భారత్‌కు విజయాన్ని అందించారు.
ఇంగ్లాండ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడీ నిదానంగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చింది. 6వ వికెట్‌కు 72 పరుగులు జోడించింది. ఇద్దరూ నాటౌట్‌లుగా నిలిచారు. దీంతో ఇంగ్లండ్ సిరీస్ భారత వశమైంది ఇక చివరి మ్యాచ్‌లో భారత్ గెలిచినా, ఓడినా, డ్రా చేసుకున్నా సిరీస్ వశమైనట్లే. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో బాధ్యయుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధ్రువ్ జురెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.