IND Vs ENG: భారత్‌కు వైట్ వాష్ తప్పదు.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ వార్నింగ్
ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ భారత్‌కు వైట్ వాష్ తప్పదంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇండియా పిచ్‌లపై ఇంగ్లాండ్ ఇలానే ఆడితే ఖచ్చితంగా 5-0తో సిరీస్ కైవసం చేసుకుటుందన్నాడు. ఓలీ పోప్, టామ్ హార్ట్‌లీ ఇలాగే ఆడాలని ఆకాంక్షించాడు.

IND Vs ENG: హైదరాబాద్ టెస్టులో ఓడిపోవడంతో భారత జట్టుపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. స్పిన్ పిచ్‌పై అదరగొట్టిన ఇంగ్లాండ్.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన నేపథ్యంలో ఆ దేశ మాజీ క్రికెటర్లు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ భారత్‌కు వైట్ వాష్ తప్పదంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇండియా పిచ్‌లపై ఇంగ్లాండ్ ఇలానే ఆడితే ఖచ్చితంగా 5-0తో సిరీస్ కైవసం చేసుకుటుందన్నాడు.
Guntur kaaram: గెట్ రెడీ.. గుంటూరు కారం నుంచి మరో సర్‌ప్రైజ్!
ఓలీ పోప్, టామ్ హార్ట్‌లీ ఇలాగే ఆడాలని ఆకాంక్షించాడు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడిపోతుందని అంతా అనుకున్నారని, పోప్ మాత్రం మ్యాచ్‌ను నిలబెట్టాడని గుర్తు చేశాడు. బౌలింగ్‌లో స్పిన్నర్ హార్ట్ లీ అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్‌ను గెలిపించాడని పనేసర్ చెప్పాడు. నిజానికి హైదరాబాద్ టెస్ట్ తొలి రెండున్నర రోజులు టీమిండియాదే ఆధిపత్యంగా నిలిచింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లు విఫలమవడం, బ్యాటర్లు చేతులెత్తేయడంతో రోహిత్ సేనకు ఓటమి తప్పలేదు.
కాగా ఈ విజయం తర్వాత ఇంగ్లాండ్ మాజీలు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడడంతో భారత అభిమానులు ఫైర్ అవుతున్నారు. తాజాగా పనేసర్ కామెంట్స్‌కు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. రెండో టెస్టులో గెలిచి చూపించాలంటూ సవాల్ చేస్తున్నారు.