ROHIT SHARMA: శతక్కొట్టిన రోహిత్, జడేజా.. రాజ్‌కోట్‌లో తొలిరోజు భారత్ హవా..
33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్ శర్మ, జడేజా జట్టును ఆదుకున్నారు. చాలా రోజుల తర్వాత హిట్ మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

ROHIT SHARMA: భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్ట్ రసవత్తరంగా ఆరంభమైంది. తొలి సెషన్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు.. పై చేయి సాధించినా.. తర్వాత రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్, సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు, జడేజా శతకంతో ఓవరాల్‌గా మొదటిరోజు భారత్ ఆధిపత్యం కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించలేదు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
YS JAGAN: చంద్రబాబు వస్తే చంద్రముఖి మళ్లీ వస్తుంది.. వలంటీర్లు భావి లీడర్లు: వైఎస్ జగన్
ఈ దశలో రోహిత్ శర్మ, జడేజా జట్టును ఆదుకున్నారు. చాలా రోజుల తర్వాత హిట్ మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. రోహిత్ సెంచరీ సాధించాడు. రోహిత్ ఇలా చేయడం దాదాపు ఏడాది తర్వాత ఇదే తొలిసారి. అటు జడేజా కూడా నిలకడగా ఆడడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. రోహిత్ శర్మ 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేసి ఔటవగా.. తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపాడు. టీ ట్వంటీ తరహాలో షాట్లు ఆడుతూ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. సెంచరీ కూడా కొట్టేస్తాడనుకున్న దశలో జడేజా చేసిన తప్పిదానికి సర్ఫరాజ్ తన వికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది.
రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. తర్వాత జడేజా తన హోంగ్రౌండ్‌లో శతకం పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. జడేజా 110, కుల్దీప్ యాదవ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. దీంతో మొదటిరోజు భారత్‌దే ఆధిపత్యం కనిపించింది.