IND Vs ENG: రాజ్‌కోట్‌లో టీమిండియాకు ప్రత్యేక ఆతిథ్యం

కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లకు హోటల్లోని సౌరాష్ట్ర థీమ్ తో ఉన్న స్పెషల్ సూట్ లను ఇచ్చారు. ఇక టీమ్ మొత్తానికి కఠియావాడీ స్పెషల్ వంటకాలను వడ్డిస్తున్నారు. సౌరాష్ట్ర రాచరిక వైభవం ఉట్టిపడేలా రాయల్ హెరిటేజ్ థీమ్ తో ఉన్న ప్రెసిడెన్షియన్ సూట్ ను రోహిత్ శర్మకు కేటాయించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2024 | 03:49 PMLast Updated on: Feb 12, 2024 | 3:49 PM

Ind Vs Eng Royal Heritage Themed Suite And Gujarati Food Festival For Team India In Rajkot

IND Vs ENG: ఇంగ్లండ్ తో మూడో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు రాజ్‌కోట్ చేరుకుంది. గురువారం నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కోసం రాజ్‌కోట్ వచ్చిన ఇండియన్ టీమ్ కు సయాజీ హోటల్లో స్టే ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు టీమ్ ఇక్కడే ఉండనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లకు హోటల్లోని సౌరాష్ట్ర థీమ్ తో ఉన్న స్పెషల్ సూట్ లను ఇచ్చారు. ఇక టీమ్ మొత్తానికి కఠియావాడీ స్పెషల్ వంటకాలను వడ్డిస్తున్నారు.

MS Dhoni: తన జెర్సీ వెనుక 7వ నంబర్..అసలు సీక్రెట్ చెప్పిన ధోనీ

సౌరాష్ట్ర రాచరిక వైభవం ఉట్టిపడేలా రాయల్ హెరిటేజ్ థీమ్ తో ఉన్న ప్రెసిడెన్షియన్ సూట్ ను రోహిత్ శర్మకు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ హోటల్స్ లో ఉండే ప్లేయర్స్ కు ఎప్పుడూ పాశ్చాత్య దేశాల్లో ఉండే రూమ్స్ లాంటివే కనిపిస్తాయని, వాళ్లకు ఓ ప్రత్యేక అనుభూతిని కలిగించాలన్న ఉద్దేశంతో తాము ఈ ప్రయత్నం చేసినట్లు సయాజీ హోటల్ మేనేజ్ మెంట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే టీమిండియాకు స్పెషల్ గుజరాతీ, కఠియావాడీ ఫుడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఉర్వేష్ చెప్పారు.

బ్రేక్‌ఫాస్ట్ కోసం ఫఫ్డా జిలేబీ, ఖాఖ్రా, గటియా, తేప్లా వంటివి ఉండగా.. లంచ్, డిన్నర్ కోసం దహీ టికారీ, వాఘెర్లా రోట్లో, కిచిడీ కాధి లాంటి కఠియావాడీ స్పెషల్ వంటకాలు ఏర్పాటు చేయనున్నారు. మూడు టెస్టుల కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించగా కోహ్లి పూర్తిగా సీరీస్ కు దూరమయ్యాడు. రాహుల్, జడేజా తిరిగి వచ్చినా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే ఈ మ్యాచ్ ఆడనున్నారు.