IND VS ENG: ఎన్నాళ్లకు ఛాన్స్.. మూడో టెస్టులో వారిద్దరి అరంగేట్రం?

శ్రేయస్‌ అయ్యర్‌ను మిగతా మూడు టెస్టుల నుంచి తప్పించగా, ఎంపిక చేసిన కేఎల్‌ రాహుల్‌ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అతనూ రాజ్‌కోట్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇవన్నీ కూడా సర్ఫరాజ్, జురెల్‌లకు ప్లస్ పాయింట్ గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2024 | 06:48 PMLast Updated on: Feb 14, 2024 | 6:48 PM

Ind Vs Eng Test Sarfraz Khan Dhruv Jurel Will Debuet Test Match

IND VS ENG: భారత్ , ఇంగ్లాండ్ మూడో టెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలయింది. సీరీస్ సమంగా ఉండడంతో ఆధిక్యం కోసం ఇరు జట్లు రెఢీ అవుతున్నాయ్. అయితే భారత్ తరపున ఇద్దరు ప్లేయర్స్ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. కీలక ఆటగాళ్లు గాయాల పాలవడం.. కోహ్లి విశ్రాంతి కొనసాగిస్తుండటం.. యువ బ్యాటర్లు సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జురెల్‌లకు కలిసొచ్చేలా ఉంది.

IND VS ENG: పేస్ ఎటాక్ తో రెడీ అయిన ఇంగ్లండ్.. మూడో టెస్టుకు తుది జట్టు ఇదే

మూడో టెస్టులో వీరిద్దరు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ప్రాక్టీస్‌ సెషన్‌లో వీరిద్దరు మాత్రం గంటల తరబడి చెమటోడ్చడం చూస్తుంటే వారి అరంగేట్రానికి సూచనగా కనిపిస్తోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వారి ప్రాక్టీస్‌ను దగ్గరుండి పరిశీలించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ను మిగతా మూడు టెస్టుల నుంచి తప్పించగా, ఎంపిక చేసిన కేఎల్‌ రాహుల్‌ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అతనూ రాజ్‌కోట్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇవన్నీ కూడా సర్ఫరాజ్, జురెల్‌లకు ప్లస్ పాయింట్ గా మారింది. ఆంధ్ర వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ వరుసగా విఫలమవడం కీపర్‌ జురెల్‌కు కలిసి రానుంది.

గత మ్యాచ్‌ ఆడిన రజత్‌ పటిదార్‌తోపాటు సర్ఫరాజ్, జురెల్‌ మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతారు. ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ ప్రాక్టీస్‌ చేయలేదు. అతని కుడిచేతి చూపుడు వేలు నొప్పి కారణంగా ట్రెయినింగ్‌కు దూరంగా ఉన్నాడు.అయితే అతని గాయం ఏమాత్రం తీవ్రమైంది కాదని జట్టు వర్గాలు వెల్లడించాయి.