IND Vs PAK: భారత్ వర్సెస్ పాక్.. జాతకం ఎలా ఉందంటే..
దీంతో ఇరుదేశాల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొత్తం 132 మ్యాచ్‌లు జరిగితే, ఇందులో భారత్ 55 మ్యాచ్‌లు గెలుపొందగా, పాకిస్తాన్ 73 మ్యాచ్‌లు గెలిచింది.

IND Vs PAK: ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉంది. అయితే షెడ్యూల్ మార్పుల కారణంగా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ తేదీని ఒకరోజు ముందుకు మార్చారు. దీంతో ఇరుదేశాల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొత్తం 132 మ్యాచ్‌లు జరిగితే, ఇందులో భారత్ 55 మ్యాచ్‌లు గెలుపొందగా, పాకిస్తాన్ 73 మ్యాచ్‌లు గెలిచింది.
4 మ్యాచ్‌లు ఫలితం ఇవ్వలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన 132 వన్డేల్లో 14వ తేదీన 4 మ్యాచ్‌లు జరిగాయి. 14వ తేదీన ఇరు దేశాల మధ్య జరిగిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రెండో మ్యాచుల్లో పాకిస్థాన్ విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, నాలుగో మ్యాచ్‌లో పాకిస్థాన్ మళ్లీ విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో 14న జరిగే ఐదో మ్యాచ్‌లో టీమిండియా విజయం ఖాయమని భావిస్తున్నారు.