IND vs SL: దంచికొట్టిన కోహ్లీ, గిల్, శ్రేయస్.. సెంచరీలు మిస్..
శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో 92 పరుగులు చేశాడు. గిల్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండటం విశేషం. ఆ తర్వాత కోహ్లీ 94 బంతుల్లో 88 పరుగులు చేశారు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లున్నాయి. అనంతరం శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాట్‌తో చెలరేగాడు.

IND vs SL: శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ సత్తా చాటారు. విరాట్ కోహ్లీ (Virat Kohli), శుభ్‌మన్‌గిల్ (Shubman Gill), శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ముగ్గురూ అర్ధ సెంచరీలతో చెలరేగారు. కొద్ది పరుగుల తేడాతో సెంచరీలు మిస్ చేసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 4 పరుగులకే ఔటయ్యాడు. అయితే, బ్రేక్.. శుభ్‌మన్‌గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడారు.
శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో 92 పరుగులు చేశాడు. గిల్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండటం విశేషం. ఆ తర్వాత కోహ్లీ 94 బంతుల్లో 88 పరుగులు చేశారు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లున్నాయి. అనంతరం శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాట్‌తో చెలరేగాడు. 56 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. అయ్యర్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ముగ్గురూ కొద్ది పరుగుల తేడాతో సెంచరీలు మిస్ చేసుకోవడం ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించింది. ప్రపంచ కప్‌లో గిల్‌కు ఇది రెండో అర్ధ సెంచరీ కాగా కోహ్లీకి ఇది 4వ అర్ధ సెంచరీ. శ్రేయస్ అయ్యర్‌కు కూడా ఈ ప్రపంచ కప్‌లో ఇది రెండో అర్ధ సెంచరీ. ఈ మ్యాచులో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా శ్రేయస్ అయ్యర్ మరో ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అయ్యర్ 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
వీరి తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా దూకుడుగా ఆడాడు. 24 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. లోకేష్ రాహుల్ 21 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 12 పరుగులు, మహ్మద్ షమి 2 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో ఇండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి.. 357 పరుగులు సాధించింది.