IND Vs WI ODI: యాదవ్ దెబ్బకు విండీస్ బొక్కబోర్లా
మూడు వన్ డేల సిరీస్ మొదటి మ్యాచ్‌లో విండీస్ కనీసం 30 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. అసలు ఆడుతుంది వన్డేనా లేక టి20 మ్యాచా అన్న అనుమానం కలిగింది. గురువారం బార్బడోస్ వేదికగా జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.
IND Vs WI ODI: ఇటీవలే టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న వెస్టిండీస్.. గురువారం నుంచి ప్రారంభమైన వన్డే సిరీస్లోనూ అదే తరహా ఆటతీరును ప్రదర్శించింది. మూడు వన్ డేల సిరీస్ మొదటి మ్యాచ్‌లో విండీస్ కనీసం 30 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. అసలు ఆడుతుంది వన్డేనా లేక టి20 మ్యాచా అన్న అనుమానం కలిగింది. గురువారం బార్బడోస్ వేదికగా జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.
విండీస్ కనీసం పోరాడే ప్రయత్నం కూడా చేయలేదు. విండీస్ బ్యాటర్లలో ‘షెయ్ హోప్’ ఒక్కడే 43 పరుగులతో కాస్త పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు అంతా చేతులెత్తేశారు. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ సంచలన స్పెల్‌తో మెరిశాడు. మూడు ఓవర్లలో రెండు మెయిడెన్లు సహా, కేవలం ఆరు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి విండీస్ బ్యాటింగ్ పతనాన్ని నిమిషాల వ్యవధిలో ముగించాడు. ఇక జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, శార్దూల్, ముకేశ్ కుమార్లు తలా ఒక వికెట్ తీశారు.
దీంతో వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచులో భారత బౌలర్లు రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్ రికార్డు నెలకొల్పారు. భారత జట్టు తరఫున ఒక వన్డేలో ఏడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్లుగా రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా జడేజా మూడు వికెట్లు సాధించి, భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.