IND vs WI ODI: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ వన్డే.. దూరదర్శన్‌లో ప్రసారాలు
గురువారం జరగనున్న ఇండియా వెస్టిండీస్ వన్డే మ్యాచుల్ని దూరదర్శన్ ప్రసారం చేయబోతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. మరుసటి రోజు వేకువజామున 3 గంటలకు మ్యాచ్ ముగియనుంది.

IND vs WI ODI: 1990, 80లకు చెందిన వారికి దూరదర్శన్‌లో క్రికెట్ మ్యాచులు చూసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ రోజుల్లో ఇండియా మ్యాచులు దూరదర్శన్‌లోనే ప్రసారం చేసేవాళ్లు. క్రమంగా బీసీసీఐ పూర్తి కమర్షియలైజ్ కావడం, ప్రైవేట్ ఛానెల్స్ రావడంతో ప్రసారాలు ఇతర స్పోర్ట్స్ ఛానెళ్లవైపు మొగ్గాయి. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇండియా మ్యాచుల్ని దూరదర్శన్ ప్రసారం చేయబోతుంది.
గురువారం జరగనున్న ఇండియా వెస్టిండీస్ వన్డే మ్యాచుల్ని దూరదర్శన్ ప్రసారం చేయబోతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. మరుసటి రోజు వేకువజామున 3 గంటలకు మ్యాచ్ ముగియనుంది. నిద్రపోయి లేచే లోపు మ్యాచ్ ఫలితం రానుంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌ను ఆస్వాదించడానికి అభిమానులకు అవకాశం లేదు. ఈ కారణంతోనే ఈ సిరీస్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులకు ప్రధాన చానెల్స్ స్టార్ స్పోర్ట్స్, సోనీ దూరంగా ఉన్నాయి. ఓటీటీ వేదికగా జియో సినిమా ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుండగా.. భారత ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ చానెల్ టీవీల్లో ప్రసారం చేస్తోంది.
జియో సినిమా కేవలం హిందీ, ఇంగ్లీష్ కామెంట్రీ మాత్రమే అందిస్తుండగా.. దూరదర్శన్ బెంగాలి, తెలుగు, కన్నడ, తమిళ్, భోజ్‌పురి భాషల్లో వ్యాఖ్యానం అందించేందుకు సిద్దమైంది. డీడీ స్పోర్ట్స్ చానెల్‌లో హిందీ, ఇంగ్లీష్ కామెంట్రీ రానుండగా.. డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి చానెల్స్‌లో తెలుగు కామెంట్రీ రానుంది.