భారత్ , పాక్ హైవోల్టేజ్ క్లాష్ టికెట్ ధర రూ.4 లక్షలు
ప్రపంచ క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కు ఉండే క్రేజే వేరు.. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ అభిమానులకు పండగే...కేవలం రెండు దేశాల అభిమానులే కాదు మిగిలిన దేశాల ఫ్యాన్స్ కూడా ఈ హైవోల్టేజ్ ఫైట్ కోసం ఎదురుచూస్తుంటారు.

ప్రపంచ క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కు ఉండే క్రేజే వేరు.. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ అభిమానులకు పండగే…కేవలం రెండు దేశాల అభిమానులే కాదు మిగిలిన దేశాల ఫ్యాన్స్ కూడా ఈ హైవోల్టేజ్ ఫైట్ కోసం ఎదురుచూస్తుంటారు. సెలబ్రిటీ నుంచి సగటు అభిమాని వరకూ చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ సమరాన్ని వీక్షించేందుకు ఎగబడుతుంటారు. అందుకే ఈ క్రేజ్ ను మార్కెట్ వర్గాలు క్యాష్ చేసుకుంటాయి. భారత్, పాక్ మ్యాచ్ కోసం అడ్వర్టైజ్ మెంట్స్ కు రేట్లు మారిపోతూ ఉంటాయి. అలాగే స్టేడియంలో టికెట్ల ధరలకు కూడా రెక్కలు వస్తుంటాయి. ఇక బ్లాక్ మార్కెట్ సంగతయితే ప్రత్యేకించి చెప్పేదేముంది. బ్లాక్ మార్కెట్ దందా ఏ రేంజ్ లో సాగుతుంది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం టికెట్లన్నీ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
ఆల్ లైన్ అమ్మకాలు ఓపెన్ చేసిన నిమిషాల్లోనే టికెట్లన్నీ ఖతమ్ అయిపోయాయి. తాజాగా ఎక్స్ డ్రా టికెట్లు కూడా ఇదే రీతిలో సోల్డ్ ఔట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఎన్ని డబ్బులు పెట్టినా టికెట్ దొరకని పరిస్థితి… కానీ ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బ్లాక్ మార్కెట్ దందా మొదలైంది. ప్రస్తుతం ఒక్కో టికెట్ ను లక్షల్లో అమ్మేందుకు బ్లాక్ మార్కెట్ కేటుగాళ్ళు రెడీ అయ్యారు. భారత కరెన్సీలో లక్ష వరకూ ఉన్న టికెట్ ను నాలుగు నుంచి ఐదు లక్షల వరకూ అమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు ఇరు దేశాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలా మంది అభిమానులు తరలివస్తుండడంతో బ్లాక్ మార్కెట్ దందా అంతా ఆన్ లైన్ లో జరుగుతోంది. టికెట్ డిమాండ్ ను బట్టి రేటు పెరుగుతూ పోతోంది. పలువురు సోషల్ మీడియా వేదికగా టికెట్లను అమ్మకానికి పెట్టారు.
ప్రస్తుతం ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారత్- పాక్ మ్యాచ్ జరగనున్న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 25వేలు. రెండేళ్ల క్రితం భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచ కప్‌లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన అహ్మదాబాద్ స్టేడియం లక్షా 25 వేల మంది హాజరయ్యారు. ఇందులో 99.9 శాతం భారత అభిమానులే. కానీ ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుండగా.. టీమిండియా మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరుగుతున్నాయి. భారత్ ఆడే మిగిలిన మ్యాచ్ లకు కూడా టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడైపోయాయి. కానీ భారత్, పాక్ పోరుకు సంబంధించే బ్లాక్ మార్కెట్ దందా ఓ రేంజ్ లో నడుస్తోంది.