World Cup: టీమిండియా తొమ్మిది మ్యాచులు వరల్డ్ కప్ ఫైనల్ షెడ్యూల్ ఇదే
వన్డే ప్రపంచ కప్ 2023 టైటిల్ కోసం బరిలోకి దిగే పది జట్లు తేలిపోయాయి.

India has released the schedule for the ODI World Cup matches to be held in India
భారత్‌తోపాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ టాప్-8లో ఉన్నాయి. ఇక అర్హత మ్యాచ్‌లో బలమైన జట్లను దాటుకొని నెదర్లాండ్స్ టాప్-10లోకి చేరింది. అంతకుముందు శ్రీలంక అందరికంటే ముందు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లతోనే అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో పది జట్లు సిద్ధమైపోయాయి. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
అక్టోబర్ 8న , చెన్నైలో భారత్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. అక్టోబర్ 11, దిల్లీలో భారత్ X అఫ్గానిస్థాన్ మ్యాచ్. అక్టోబర్ 15, అహ్మదాబాద్ లో భారత్ X పాకిస్థాన్ మ్యాచ్. అక్టోబర్ 19, పుణె లో భారత్ X బంగ్లాదేశ్ మ్యాచ్. అక్టోబర్ 22, ధర్మశాలలో భారత్ X న్యూజిలాండ్ మ్యాచ్. అక్టోబర్ 29, లక్నలో భారత్ X ఇంగ్లాండ్ మ్యాచ్. నవంబర్ 2, ముంబయిలో భారత్ X శ్రీలంక మ్యాచ్. నవంబర్ 5, కోల్‌కతాలో భారత్ X దక్షిణాఫ్రికా మ్యాచ్. నవంబర్ 11, బెంగళూరులో భారత్ X నెదర్లాండ్స్ మ్యాచ్ జరగనుంది.