2025 Asia Cup : భారత్ లో 2025 ఆసియాకప్.. 34 ఏళ్ళ తర్వాత ఆతిథ్యం

భారత్ (India) మరో మెగా టోర్నీ (Mega Tournament) కి ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2026 టీట్వంటీ వరల్డ్ కప్ (2026 T20 World Cup) కంటే ముందే 2025 ఆసియాకప్ (Asia Cup) కు హోస్ట్ చేయబోతోంది. భారత్ వేదికగా ఈ టోర్నీ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 29, 2024 | 05:54 PMLast Updated on: Jul 29, 2024 | 5:54 PM

India Is Going To Host Another Mega Tournament It Is Going To Host The 2025 Asia Cup Before The 2026 Twenty20 World Cup

భారత్ (India) మరో మెగా టోర్నీ (Mega Tournament) కి ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2026 టీట్వంటీ వరల్డ్ కప్ (2026 T20 World Cup) కంటే ముందే 2025 ఆసియాకప్ (Asia Cup) కు హోస్ట్ చేయబోతోంది. భారత్ వేదికగా ఈ టోర్నీ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా వరల్డ్ కప్ ఏ ఫార్మాట్ లో ఉంటే అదే ఫార్మాట్ లో ఆసియా కప్ నిర్వహిస్తున్నారు. దీంతో 2026లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉండడంతో 2025 ఆసియాకప్ కూడా టీ20 ఫార్మాట్ (T20 Format) లోనే జరుగుతుంది. ఇక 2027 ఆసియా కప్ కు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుండగా జరుగుతుందని.. అప్పుడు ఈ టోర్నీ వన్డే ఫార్మాట్ లో జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. ఎందుకంటే 2027 దక్షిణాఫ్రికా వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది.

కాగా 2025 ఆసియా కప్ (2025 Asia Cup) లో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan), శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తో పాటు మరో జట్టు క్వాలిఫైయింగ్ టోర్నీ ద్వారా ఎంట్రీ ఇవ్వనుంది. షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ ఈ టోర్నీ సెప్టెంబర్ లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 13 మ్యాచ్ లు జరగనున్నాయి. కాగా 2025 ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ.. ఏప్రిల్, మే నెలలో ఐపీఎల్ జరగనుండగా…. ఆ తర్వాత భారత్ వన్డే, టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ లోనూ, జూన్ నుంచి ఆగస్టు వరకు ఇంగ్లాండ్ లోనూ పర్యటించనుంది.