వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్… భారత్ , పాక్ ఫైనల్ కు ఛాన్సుందా ?
రల్డ్ క్రికెట్ లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయంటే ఆ క్రేజే వేరు...ఫార్మాట్ తో సంబంధం లేకుండా చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం ఇరు దేశాల అభిమానులే కాదు యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
వరల్డ్ క్రికెట్ లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయంటే ఆ క్రేజే వేరు…ఫార్మాట్ తో సంబంధం లేకుండా చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం ఇరు దేశాల అభిమానులే కాదు యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పాక్ తో ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో ఇరు జట్ల మధ్య సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్ , పాక్ తలపడుతున్నాయి. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఇరు జట్లు తలపడే అవకాశముందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వరుస విజయాలతో టీమిండియా దాదాపు ఫైనల్ చేరుకున్నట్టే.. అదే సమయంలో మిగిలిన ఒక బెర్త్ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , ఇంగ్లాండ్ రేసులో ఉన్నాయి.
అయితే పాకిస్తాన్ కూడా ఫైనల్ కు చేరే అవకాశాలు లేకపోలేదు. సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ కు గురైన పాక్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ ప్లేస్ లో ఉంది. తర్వాత వరుసగా పాక్ న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ లతో టెస్ట్ సిరీస్ లు ఆడబోతోంది. ఈ మూడింటిలోనూ సిరీస్ విజయాలను అందుకుంటే పాక్ తన ప్లేస్ ను మెరుగుపరుచుకుంటుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ తమ సొంతగడ్డపై జరుగుతుండడం ఒక్కటే పాకిస్తాన్ కు అడ్వాంటేజ్.. మిగిలిన సౌతాఫ్రికా, విండీస్ జట్లతో సిరీస్ ఆడేందుకు వారి దేశాలే వెళ్ళనున్న పాక్ నుంచి విజయాలు ఆశించడం అత్యాశే అవుతుంది. బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ సౌతాఫ్రికా, వెస్టిండీస్ లపై గెలుస్తుందా అనేది డౌటే. ఒకవేళ అదే జరిగితే ఆసీస్, ఇంగ్లాండ్ ఫలితాలు కూడా కలిసొస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్, పాక్ టైటిల్ పోరు చూడొచ్చు.