ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్ స్టేడియంలో స్టార్స్ సందడి
చాంపియన్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జోరుగా కొనసాగుతోంది. భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు చిత్తుచిత్తు అయ్యారు.

చాంపియన్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జోరుగా కొనసాగుతోంది. భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు చిత్తుచిత్తు అయ్యారు. భారత బౌలర్లు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే పాకిస్థాన్ ను ఆల్ అవుట్ చేశారు. ఆల్ అవుట్ సమయానికి పాకిస్థాన్ బాటర్లు 241 స్కోర్ తో ముగించారు. ఇన్నింగ్స్ బ్రేక్ అనంతరం భారత బ్యాటర్లు బరిలో దిగారు. బౌలింగ్‌తో ఎలా భయపెట్టారో బ్యాటింగ్‌తో అంతకు మించి భయపెడుతున్నారు. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఈ క్రమంలోనే లైవ్ మ్యాచ్ ను తిలకించేందుకు క్రికెట్ అభిమానులను పెద్ద ఎత్తున దుబాయ్ తరలివెళ్లారు.
ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. వీరంతా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సందడి చేశారు. వీరిలో పద్మ విభూషన్, మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మెగాస్టార్‌తో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి మ్యాచ్ ను తిలకిస్తున్నారు. మరో వైపు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు. టీమిండియా జెర్సీతో కొడుకుతో కలిసి స్టేడియంలో సందడి చేశారు. లోకేష్‌తో పాటు ఎంపీ కేశినేని చిన్ని సహా పలువురు టీడీపీ ప్రముఖులు దుబాయ్‌కు వెళ్లారు.
ఇక పుష్ప సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన డైరెక్టర్ సుకుమార్ కూడా తన ఫ్యామిలీతో దుబాయ్‌కు వెళ్లారు. కొడుకు కూతురితో కలిసి స్టేడియంలో కేరింతలు కొడుతూ మ్యాచ్ చూశారు. ప్రస్తుతం వీళ్ల ఫొటోలు వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ చూస్తున్నవ వీడియోలు ఫొటోలు కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ధోనీ యాక్టర్ సన్నీ డియోల్‌తో కలిసి ఓ యాడ్ షూట్ చేస్తున్నాడు. ఈ యాడ్ సెట్లోనే ప్రొజెక్టర్ పెట్టుకుని మరీ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ధోనీ. నార్మల్‌గా సెలబ్రిటీస్‌ని చూస్తే అంతా కేరింతలు కొడుతూ ఎగ్జైట్ అవుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం స్టార్స్ ఆడియన్స్‌లా మారి టీమిండియా ఉగ్ర రూపాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.