INDIA VS ENGLAND: ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకు భారత జట్టు ప్రకటన.. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఔట్..
వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండడం లేదు. అతని రిక్వెస్ట్‌ను గౌరవించిన సెలక్షన్ కమిటీ.. కోహ్లీని ఎంపిక చేయలేదు. అలాగే గాయంతో ఇబ్బంది పడుతున్నశ్రేయస్ అయ్యర్ కూడా సిరీస్‌కు దూరమయ్యాడు.

INDIA VS ENGLAND: ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే విరాట్ కోహ్లీ సిరీస్ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండడం లేదు. అతని రిక్వెస్ట్‌ను గౌరవించిన సెలక్షన్ కమిటీ.. కోహ్లీని ఎంపిక చేయలేదు. అలాగే గాయంతో ఇబ్బంది పడుతున్నశ్రేయస్ అయ్యర్ కూడా సిరీస్‌కు దూరమయ్యాడు.
TDP LEADERS TENSION : టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు… బీజేపీ బాంబు ఎవరిపై పడుతుందో…
అయితే రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ జట్టులోకి తిరిగి వచ్చారు. గాయాల నుంచి కోలుకున్నప్పటికీ ఫిట్‌నెస్ సాధిస్తేనే మూడో టెస్టులో వారిద్దరూ ఆడతారు. బీసీసీఐ మెడికల్ టీమ్ వీరిద్దరికీ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇస్తేనే తుది జట్టులో చోటు దక్కుతుంది. వీరిద్దరినీ కొనసాగిస్తుండడంతోనే శ్రేయస్ అయ్యర్‌కు రీప్లేస్‌మెంట్‌గా మరొకరిని ఎంపిక చేయలేదు. ఇదిలా ఉంటే మిగిలిన జట్టులో ఎటువంటి మార్పులూ లేవు. అయితే దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సీనియర్ బ్యాటర్ పుజారాకు మరోసారి నిరాశే మిగిలింది. రీఎంట్రీపై అతను ఆశలు పెట్టుకున్నా సెలక్టర్లు పట్టించుకోలేదు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో యువ క్రికెటర్లవైపే సెలక్షన్ కమిటీ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం జట్టులో ఉన్న రజత్ పటిదార్, సర్ఫ్‌రాజ్ ఖాన్ఖలలో ఒకరికి మూడో టెస్టులో ఆడే అవకాశం రానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో మూడో మ్యాచ్ రాజ్ఖకోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానుంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలిస్తే.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో దెబ్బకొట్టిన భారత్ లెక్క సరిచేసింది.