Virat Kohli: విరాట్ ఛాతి మీద పాకిస్థాన్ పేరు

క్రికెట్ అభిమానులకి అసలుసిసలు మజా అందించే మ్యాచ్ ఏదైనా ఉందంటే.. అది భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇరు జట్లు ఎప్పుడో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం మానేశాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూడాలంటే ఐసీసీ టోర్నీల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 11, 2023 | 11:28 AMLast Updated on: Aug 11, 2023 | 11:28 AM

India To Wear Jersey With Pakistan Written On It During Continental Event

Virat Kohli: ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారెంటీ. దాయాదుల మధ్య జరిగే పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ అభిమానులకి అసలుసిసలు మజా అందించే మ్యాచ్ ఏదైనా ఉందంటే.. అది భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇరు జట్లు ఎప్పుడో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం మానేశాయి.

దీంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూడాలంటే ఐసీసీ టోర్నీల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఈ సారి మాత్రం ఆసియా కప్, వరల్డ్ కప్ ఉండడంతో భారత్, పాక్ మధ్య కనీసం మూడు నుంచి నాలుగు మ్యాచులు చూసే అవకాశం అభిమానులకి దక్కనుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు టీమిండియా జెర్సీపై పాక్ పేరు రాయడం అభిమానులని సందిగ్ధంలో పడేసింది. ఆసియా కప్ 2023 ఆగస్టు 30న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా టీమిండియా కొత్త జెర్సీతో అభిమానులని అలరించనుంది. అయితే భారత్ ధరించబోయే ఈ జెర్సీ మీద పాకిస్తాన్ పేరు ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాళ్లోకేతే.. ఆసియా కప్ 2023 కి పాకిస్థాన్ ఆతిధ్యమిస్తున్న సంగతి తెలిసిందే.

నిబంధనల ప్రకారం ఏదైనా మెగా టోర్నీకి ఒక దేశం ఆతిధ్యమిస్తే.. ఆ దేశం పేరు జెర్సీలపై ఉంటుంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా కొత్త జెర్సీ ధరించి అభిమానులని సర్‌ప్రైజ్‌కి గురి చేశారు. ప్రస్తుతం వీరు ధరించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.