INDIA U19 World Cup: భళా యువ భారత్.. టీమిండియా అండర్ 19 అరుదైన రికార్డ్
యంగ్ ఇండియా తొలి గ్రూప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 201 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తర్వాత యూఎస్‌ఏను సైతం అదే 201 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సూపర్ సిక్స్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 214 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

INDIA U19 World Cup: భారత యువ జట్టు.. అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మెగా టోర్నీ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 200 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయాలు సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎడిషన్‌లో.. యంగ్ ఇండియా తొలి గ్రూప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 201 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తర్వాత యూఎస్‌ఏను సైతం అదే 201 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
Bharat Rice: రేపటినుంచి మార్కెట్లోకి రాబోతున్న భారత్ రైస్.. కేజీ రూ.29..
సూపర్ సిక్స్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 214 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 200 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలుపొందిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. గతంలో ఇలాంటి రికార్డు ఏ జట్టుకూ సాధ్యం కాలేదు. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఉన్న రికార్డులు కూడా మరే జట్టుకూ లేవు. ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత్.. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. యంగ్ ఇండియా తమ తర్వాతి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడుతుంది. ఈ టోర్నీలో భారత యువక్రికెటర్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు.
బ్యాటింగ్ విభాగంలో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. వరుస సెంచరీలతో దుమ్మురేపిన ముషీర్‌ఖాన్ 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో టోర్నీలో 325 పరుగులు చేశాడు. అటు బౌలింగ్ విభాగంలో సౌమీ పాండే అత్యధిక వికెట్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ యువ బౌలర్ 4 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.