India vs Australia: మూడు మ్యాచులు.. వరల్డ్ కప్ టీజర్‌లు..
ఈ మూడు వన్డేలకు టీమిండియా ఇప్పటికే వేర్వేరు జట్లను ప్రకటించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌తో పాటు ప్రపంచకప్‌పై టీమిండియా కన్నేసింది. మన జట్టు 3-0తో ఆసీస్ సిరీస్‌ను వైట్‌వాష్ చేస్తే, వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజిషన్‌కు చేరుకుంటుంది.

India vs Australia: ఆసియా కప్ 2023 ఛాంపియన్‌గా నిలిచిన భారత క్రికెట్ జట్టు.. స్వదేశంలో జరిగే వరల్డ్ కప్‌కు ముందు మరో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22న మొహాలీలో ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 5 నుంచి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ICC ODI క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ బిగ్ టోర్నీకి ముందు ఆసీస్ సిరీస్ మన వాళ్లకు ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది.
ఈ మూడు వన్డేలకు టీమిండియా ఇప్పటికే వేర్వేరు జట్లను ప్రకటించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌తో పాటు ప్రపంచకప్‌పై టీమిండియా కన్నేసింది. మన జట్టు 3-0తో ఆసీస్ సిరీస్‌ను వైట్‌వాష్ చేస్తే, వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజిషన్‌కు చేరుకుంటుంది. అయితే ఆస్ట్రేలియా భారత్‌ను 3-0తో వైట్‌వాష్ చేయగలిగితే, ఆ జట్టు కూడా ప్రపంచ నంబర్ 1 వన్డే జట్టుగా అవతరిస్తుంది. ఆసియా కప్ గెలిచి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో భారత్ ఈ సిరీస్‌కి రెడీ అవుతుండగా, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-3తో కోల్పోయింది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్‌కు ముందు సత్తా చాటాలని రెండు జట్లు ప్రణాళికలు రచిస్తున్నాయి. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ODI సిరీస్ సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా ప్రారంభమవుతుంది.
రెండో వన్డే సెప్టెంబర్ 24న ఇండోర్‌లో, మూడో మ్యాచ్ సెప్టెంబర్ 27న రాజ్‌కోట్‌లో జరుగుతాయి. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. వన్డే సిరీస్ మ్యాచ్‌లు ఇండియాలో Sports18 నెట్‌వర్క్ ఛానెల్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. జియో సినిమా వెబ్‌సైట్, యాప్‌లో ఉచితంగా మ్యాచ్‌లను చూడవచ్చు.