India vs Australia live : పెళ్లి మండపంలో ఇండియా vs ఆస్ట్రేలియా live ప్రసారం..

దేశమంతా క్రికెట్ ను కలవరిస్తుంది. ఈ క్షణంలో ఏ ఇంటి గడప తొక్కిన మీకు టీవీల్లో ప్రసారం అయ్యేది మాత్రం ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచే.. అవును మరి ఇప్పుడు దేశం మొత్తం క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. అందులోనూ ఆదివారం సెలవుదినం కావడంతో.. ఉద్యోగులు, యువత అంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 19, 2023 | 08:45 PMLast Updated on: Nov 19, 2023 | 8:45 PM

India Vs Australia Live Broadcast At Wedding Hall

దేశమంతా క్రికెట్ ను కలవరిస్తుంది. ఈ క్షణంలో ఏ ఇంటి గడప తొక్కిన మీకు టీవీల్లో ప్రసారం అయ్యేది మాత్రం ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచే.. అవును మరి ఇప్పుడు దేశం మొత్తం క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. అందులోనూ ఆదివారం సెలవుదినం కావడంతో.. ఉద్యోగులు, యువత అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దేశం అంతటా.. టీవీల్లోనూ.. యువత సెల్ ఫోన్ లోనూ ఎటూ చూడు మ్యాచు.. మ్యాచు.. మ్యాచు..

Sonia Gandhi : టీమిండియా గెలుస్తుంది.

ఇక యువతలో చాలా మందికి క్రికెట్ అంటే ప్రాణం.. మరి ఎక్కువ ఇష్టం ఉన్నవారు తమ వీదులో క్రికెట్ ను live గా చూసేందుకు వెసులు బాటు కల్పిస్తారు. కానీ ఇది మాత్రం ఎప్పుడు, ఎక్కడా చూడాని.. వినూత్న ఘటన జరిగింది. ఇవాళ ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ పైగా ఆదివారం సెలవు దినం.. ఇదే రోజు ఓ పెళ్లి పెట్టుకున్నాడు ఓ యువకుడు.. తన వివాహానికి విచ్చేసే బంధువులు కూడా ఈ మ్యాచ్‌ను మిస్సవకూడదని కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా తన పెళ్లి మండపంలో పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు.

ఈ విన్తూ వివాహం ఎక్కడో కాదు.. మన తెలంగాణలోనే.. మన కరీంనగర్‌ నగరంలోని ఓ ఫంక్షన్ హల్‌లో కనిపించింది. అయితే.. ఆదివారం రోజున ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఇదే రోజున యువకుడి వివాహం ఉంది. వరుడు కూడా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం తాను ఓ క్రికెట్ అభిమాని.. పెళ్లికొడుకు.. వివాహానికి వచ్చే మిగతా బంధువులు, యువత తన పెళ్లి వల్ల మ్యాచ్ లైవ్‌లో చూసే అవకాశాన్ని మిస్సవ్వొద్దని ఈ నిర్ణయం తీసుకున్నాడు. చాలా వరకు చాలా మంది క్రికెట్ అభిమానులు.. ఇండియా మ్యాచ్ ఉందంటే ఏ ఇంపార్టెంట్ పని ఉన్నా దాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు ఇది గంతో కూడా చాలా సార్లు చూశాం. కానీ ఈ వరుడు అలాంటిది ఏమి చేయలేదు.. అలా పెళ్లి చేసుకున్నారు.. ఇలా క్రికెట్ లైవ్ చూస్తు.. బంధువలుకు చూపించాడు.