INDIA Vs Australia: వైజాగ్‌లో భారత్-ఆసీస్ టీ20.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి కాస్తయినా ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఇప్పిటకే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్ విక్రయాలు జరిగాయి.

INDIA Vs Australia: ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సీరిస్ కోసం ఇప్పటికే ఇరు జట్లు విశాఖకు చేరుకున్నాయి. భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్ గురువారం విశాఖపట్నంలో జరగనుంది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి కాస్తయినా ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఇప్పిటకే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్ విక్రయాలు జరిగాయి.
Gautam Gambhir: నాకు అతడితో బ్యాటింగ్ చేయడం ఇష్టం: గౌతమ్
ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ఓటమి తర్వాత క్రికెట్ అభిమానులు చాలా డీలా పడ్డారు. ఇప్పటికీ ఆ ఫలితం నుంచి తేరుకోలేకపోతున్నారు. అయినప్పటికీ కీలకమైన పోరు ముగిసిన తర్వాత జరుగుతున్న టీ-20 మ్యాచ్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ టీ20 సిరీస్‌కు ఇండియా కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్, ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు కసరత్తులు చేస్తున్నాయి. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం జియో సినిమా యాప్‌లో కూడా చూడొచ్చు.