India vs England: జైస్వాల్ డబుల్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు
రెండో రోజు ఆటలోనూ యశస్వీ జైస్వాల్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. జైశ్వాల్.. దూకుడుగా ఆడుతూ డబుల్ సెంచరీ సాధించాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ, సిక్సర్ వరుసగా బాది ద్విశతకాన్ని అందుకున్నాడు.
India vs England: విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులే చేసింది. రెండో రోజు ఆటలోనూ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. జైశ్వాల్.. దూకుడుగా ఆడుతూ డబుల్ సెంచరీ సాధించాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ, సిక్సర్ వరుసగా బాది ద్విశతకాన్ని అందుకున్నాడు.
Poonam Pandey: నాకేం కాలేదు.. నేను బతికే ఉన్నా.. పూనమ్ పాండే సంచలనం
డబుల్ సెంచరీ అనంతరం జైస్వాల్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ తర్వాత టీమిండియా ఆలౌట్ కావడానికి ఎక్కువ సేపు పట్టలేదు. కాగా, భారత్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ది హైలైట్ ఇన్నింగ్స్. టీమిండియా సాధించిన స్కోరులో సగానికిపైగా జైస్వాలే చేసినవే. జైస్వాల్ తర్వాత శుభ్‌మన్ గిల్ సాధించిన 34 పరుగులే అత్యధిక స్కోరు. ఇంగ్లండ్ బౌలర్లలో 41 ఏళ్ల అండర్సన్ సత్తాచాటాడు. 25 ఓవర్లు వేసి 47 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అరంగేట్ర బౌలర్ షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ కూడా చెరో మూడు వికెట్లు తీశారు. అయితే బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్‌పై 400 పరుగులు సాధించలేకపోవడం భారత్‌కు నిరాశకు గురి చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ తడబడుతోంది. 136 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఓలీ పోప్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లండ్ మొదటి టెస్టు గెలవడంలో ఓలీ పోప్ కీలకపాత్ర పోషించాడు. అయితే, రెండో టెస్టులో మాత్రం తక్కువ పరుగులకు ఔటయ్యాడు. అంతకుముందు జాక్ క్రాలే 76 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ ఉన్నారు.