INDIA VS ENGLAND: సాగర తీరాన కొట్టాలి దెబ్బ.. సిరీస్ సమం చేయడమే లక్ష్యంగా భారత్‌

విశాఖలో మన బ్యాటర్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్‌ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. అలాగే శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా వైఫల్యాల బాట వీడకుంటే కష్టమేనని చెప్పొచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 1, 2024 | 08:21 PMLast Updated on: Feb 01, 2024 | 8:21 PM

India Vs England Second Test Prediction Here Is The Winning Plan Of Team India

INDIA VS ENGLAND: స్పిన్‌ పిచ్‌తో ఇంగ్లాండ్‌ను దెబ్బ కొడదామనుకుని అదే ఉచ్చులో చిక్కుకుని పరాజయం పాలైన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్ధమైంది. విశాఖ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. జడేజా, రాహుల్ దూరమవడం ఎదురుదెబ్బగానే భావిస్తున్నా.. యువక్రికెటర్ల ఎంట్రీతో ఇంగ్లాండ్‌ను నిలువరించాలని ఎదురుచూస్తోంది. మన బౌలర్లు తేలిపోవడం, ఫీల్డింగ్ తప్పిదాలు ఇంగ్లాండ్‌కు కలిసొచ్చాయి.

INDIA U19 World Cup: భళా యువ భారత్‌.. టీమిండియా అండర్ 19 అరుదైన రికార్డ్

దీనిని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లాండ్ మంచి టార్గెట్‌ను భారత్ ముందు ఉంచడమే కాకుండా బౌలింగ్‌లోనూ అదరగొట్టి విజయం సాధించింది. బ్యాటర్ల వైఫల్యమే ఈ ఓటమికి కారణంగా చెప్పొచ్చు. దీంతో విశాఖలో మన బ్యాటర్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్‌ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. అలాగే శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా వైఫల్యాల బాట వీడకుంటే కష్టమేనని చెప్పొచ్చు. కాగా జడేజా, కెఎల్ రాహుల్ గాయాలతో దూరమవడంతో తుది జట్టులో సర్ఫరాజ్, రజిత్ పాటిదార్‌లో ఒకరికి చోటు దక్కనుంది. ఇద్దరూ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటకీ.. మేనేజ్‌మెంట్ ఎవరిని తీసుకుంటుందనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. మరోవైపు జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం లభించనుంది. ఈ మ్యాచ్‌లో భారత్.. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

దీని కోసం హైదరాబాదీ పేసర్ సిరాజ్‌ను తప్పించనుండగా.. కుల్దీప్‌ యాదవ్‌ రానున్నాడు. మరోవైపు హైదరాబాద్ టెస్టు ఆరంభంలో వెనుకబడి తర్వాత చక్కని ఆటతీరుతో గెలిచిన ఇంగ్లాండ్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది. సిరీస్ సమం చేసే అవకాశం భారత్‌కు ఇవ్వకూడదన్న లక్ష్యంతో కనిపిస్తున్న ఇంగ్లీష్ టీమ్‌కు పేసర్ ఆండర్సన్ రీఎంట్రీ బలాన్నిచ్చేదే. అలాగే స్పిన్నర్ హార్ట్‌లీపైనే మరోసారి అంచనాలున్నాయి. ఇక విశాఖ పిచ్‌ స్పిన్నర్లకే అనుకూలిస్తుందని అంచనా. ఇదిలా ఉంటే విశాఖ స్టేడియంలో భారత్‌కు మంచి రికార్డే ఉంది. దీంతో టీమిండియా సిరీస్‌ సమం చేస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.