IND vs IRE: ఐర్లాండ్‌తో టి20 సిరీస్.. ఫ్రీగా చూడాలంటే ఇలా..
తొలి టి20 ఆగస్టు 18న జరగనుంది. రెండో టి20 ఆగష్టు 20న జరగనుంది. మూడో మ్యాచ్ 23వ తేదీన జరుగుతుంది. ఈ మూడు మ్యాచ్‌లు కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానున్నాయి.

IND vs IRE: ఏడాది గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ చేస్తోన్న జస్ ప్రీత్ బుమ్రా ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వెన్ను గాయం అనంతరం బుమ్రా ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. తొలి టి20 ఆగస్టు 18న జరగనుంది. రెండో టి20 ఆగష్టు 20న జరగనుంది. మూడో మ్యాచ్ 23వ తేదీన జరుగుతుంది. ఈ మూడు మ్యాచ్‌లు కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానున్నాయి. ఈ సిరీస్‌లో భారత్ సీనియర్లు లేకుండానే బరిలోకి దిగనుంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి కల్పించారు. ఈ టి20 సిరీస్‌ను స్పోర్ట్స్ 18 ఛానెల్‌తో పాటు జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. టీవీలో అయితే స్పోర్ట్స్ 18 చానెల్‌లో వీక్షించాలి. డిజిటల్‌లో అయితే జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సిరీస్‌ను ఎటువంటి సబ్ స్క్రిప్షన్ లేకుండానే జియో సినిమా ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మ్యాచ్ జరిగే రోజు రాత్రి 7.15 గంటల నుంచి లైవ్ ఆరంభం కానుంది. మ్యాచ్ 7.30 గంటలకు ఆరంభం అవుతుంది.