India vs New Zealand: ధోనీ రనౌట్‌పై ప్రతీకారానికి భారత్ రెడీ..
2019 ప్రపంచకప్ సెమీస్‌లో కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.3 ఓవర్‌లలో 221 పరుగులకు ఆలౌటైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ పోరులో కివీస్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
India vs New Zealand: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్ అనగానే, భారత క్రికెట్ అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి గత ప్రపంచకప్‌లో ధోనీ రనౌట్ రూపంలో వెనుదిరిగి టీమిండియా మ్యాచ్ ఓడిపోవడం.
Rohit Sharma: టీమిండియా బ్రహ్మాస్త్రం అతడే.. సెమీస్‌లోనూ విజృంభిస్తే..
రెండోది ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఉన్న ఘోరమైన రికార్డు. 2019 ప్రపంచకప్ సెమీస్‌లో కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.3 ఓవర్‌లలో 221 పరుగులకు ఆలౌటైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ పోరులో కివీస్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ చివరి వరకు పోరాడినా కీలక సమయంలో జడేజా, ధోనీ ఔట్ అవ్వడంతో కివీస్ గెలుపొందింది. ధోని రనౌట్ అయి కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు ఇప్పటికీ అభిమానుల మనసులను తడి చేస్తాయి. ICC టోర్నమెంట్‌లలో భారత్-న్యూజిలాండ్ మొత్తం పదిసార్లు తలపడగా అందులో కేవలం రెండుసార్లు మాత్రమే టీమిండియా గెలుపొందింది. గతంలో నాలుగుసార్లు నాకౌట్ మ్యాచుల్లో తలపడగా నాలుగుసార్లు ఓడిపోయింది.
కానీ ఇదే ప్రపంచకప్‌లో ఈ సంప్రాదాయాన్ని టీమిండియా బద్దలు కొట్టింది. లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి కొత్త శకానికి నాంది పలికింది. రోహిత్ నాయకత్వంలో న్యూజిలాండ్‌ను దెబ్బతీయడం ద్వారా భారత్ తన దీర్ఘకాల పరాజయ పరంపరను ముగించింది. ఇక భారత్ సునామీలో కివీస్ జట్టు గల్లంతు కావడమే మిగిలింది.