Virat Kohili: పట్టాలంటే కోహ్లీనే అత్యధిక క్యాచ్చులు మనోడివే

వెస్టిండీస్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి రాకుండానే అరుదైన ఘనత సాధించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 29, 2023 | 05:10 PMLast Updated on: Jul 29, 2023 | 5:10 PM

Indian Batsman Virat Kohli Holds The Record For Most Catches In Odi Matches

దీంతో న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు. అదేలా అంటే.. రవీంద్ర జడేజా వేసిన 18వ ఓవర్‌లో రొమరియో షెఫర్డ్ ఇచ్చిన క్యాచ్‌ పట్టుకున్నాడు కోహ్లీ. ఇది కోహ్లీకి తన వన్డే కెరీర్‌లో 142వ క్యాచ్‌. అంతే.. వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన 4వ ఆటగాడిగా కోహ్లీ అవతరించాడు. రాస్ టేలర్ 236 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. కోహ్లీ 275 మ్యాచ్‌ల్లో టేలర్ రికార్డ్‌ని సమం చేశాడు. కాగా, వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే అగ్రస్థానంలో ఉన్నాడు. జయవర్ధనే 448 మ్యాచ్‌ల్లో 218 క్యాచ్‌లు పట్టుకున్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 375 మ్యాచుల్లో 160 వన్డే క్యాచ్‌లతో రెండో స్థానంలో.. భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 334 మ్యాచుల్లో 156 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నారు.