Bhuvaneshwar: భువి ఇంస్టాగ్రామ్ లో ఇది గమనించారా?
టీమిండియా తరపున బెస్ట్ స్వింగ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకడు. అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం చేసిన తొలి బంతికే వికెట్ తీసి తన ఎంట్రీని ని గ్రాండ్ గా చాటుకున్నాడు.
ఆ తర్వాత స్వింగ్ కింగ్ గా భారత క్రికెట్ లో కొన్నేళ్లు తన హవా చూపించాడు. క్రమంగా మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ గా మారిన భువీ.. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేయడమే కాదు నకుల్ బాల్ తో బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఇక ఐపీఎల్ లో అయితే ఈ స్వింగ్ బౌలర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాణ్యమైన బౌలింగ్ తో ఎప్పుడూ పర్పుల్ క్యాప్ క్యాప్ రేస్ లో ఉంటాడు. ఎంతో మందికి ఫేవరేట్ బౌలర్ గా మారిన భువనేశ్వర్ తాజాగా తన రిటైర్మెంట్ విషయంపై సంకేతమిచ్చాడు.
33 ఏళ్ల భువీ ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో క్రికెటర్ అనే పదాన్ని తొలగించి అభిమానులని నిరాశకు గురి చేసాడు. ఇంతకు ముందు భువనేశ్వర్ ఇంస్టాగ్రామ్ బయోలో ‘ఇండియన్ క్రికెటర్’ అని ఉండేది. కానీ ప్రస్తుతం ఈ ఫాస్ట్ బౌలర్ ఆ పదాన్ని తొలగించి ‘ఇండియన్, ఫ్యామిలీ ఫస్ట్, పెట్ లవర్, కాజువల్ గేమర్’ అనే పదాలు అతడి బయోలో కొత్తగా చేర్చాడు. 2022 జనవరిలో భారత్ తరఫున చివరి వన్డే సౌత్ ఆఫ్రికా మీద ఆడాడు. పార్ల్ వేదికగా జరిగిన ఆ మ్యాచులో 8 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ దక్కలేదు. ఇక అప్పటి నుంచి గాయాలు, పేలవ ఫామ్ కారణంగా అతడు వన్డే జట్టుకు దూరమయ్యాడు.
భారత్ తరఫున 21 టెస్టుల్లో 61 వికెట్లు,117 వన్డేల్లో 132 వికెట్లు, 48 టీ20ల్లో 49 వికెట్లు పడగొట్టాడు. మూడు ఫార్మాట్ లలో 5 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్ భువీనే కావడం విశేషం. ఐర్లాండ్ సిరీస్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు భువీ గుడ్ బై చెబుతాడని తెలుస్తోంది. అయితే భువీ అభిమానులు మాత్రం బీసీసీఐ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పని తాను చేసు పోయేవాళ్ళని బీసీసీఐ గుర్తించరని విచారం వ్యక్తం చేస్తున్నారు. భువీలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని.. అతడు భారత అత్యుత్తమ బౌలర్లలో ఒకడని ఈ సందర్భంగా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.