ఆటలో హిట్..అక్కడ్ ఫట్ పెటాకులవుతున్న క్రికెటర్ల పెళ్ళిళ్ళు
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇలా పెళ్ళి చేసుకుని...కొన్నాళ్ళు కలిసుండి...విడిపోతున్నారు.
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇలా పెళ్ళి చేసుకుని…కొన్నాళ్ళు కలిసుండి…విడిపోతున్నారు. ఏ రోజున ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అన్న రీతిలో పరిస్థితి మారిపోయింది. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. సినిమా వాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా క్రికెటర్లు సైతం విడాకులు బాట పడుతున్నారు హార్దిక్ పాండ్యా, షమీ, దినేశ్ కార్తీక్, శిఖర్ ధావన్ వంటి ఇండియాన్ క్రికెటర్లు తమ జీవిత భాగస్వామి నుంచి విడాకులు తీసుకున్నారు. టీమిండియా స్టార్ బౌలర్ చాహల్ సైతం తన భార్య ధనశ్రీకి విడాకులు ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ జంట ఇప్పటికే సపరేటుగా ఉంటున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆటలో హిట్ అయిన క్రికెటర్లు వ్యక్తిగత జీవితాలలో ఎందుకు ఫెయిలవుతున్నారన్న చర్చ జరుగుతోంది. దీనికి చాలా కారణాలే చెబుతున్నారు. మొదటిది సెలబ్రిటీలుగా లగ్జరీ జీవితం ఉన్నప్పుడు సహజంగానే చాలా విషయాలను లైట్ తీసుకుంటుంటారు. రిలేషన్స్ కు పెద్ద ప్రాధాన్యత ఇవ్వరన్నఅభిప్రాయం కూడా ఉంది. పలువురి సెలబ్రిటీల విషయాల్లో ఇది రుజువైంది కూడా. అలాగే ఫైనాన్షియల్ గా ఇద్దరూ సెటిల్ అయిన పరిస్థితుల్లో చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా వ్యవహరిస్తుంటారు. ఎలాంటి విషయాన్నైనా వారు డీల్ చేసే విధానం వేరేలా ఉంటుంది. అలాగని డబ్బున్నోళ్ళంతా విడాకులు తీసుకుంటున్నారని కాదు కానీ ఆర్థిక స్వతంత్రం ఉంటే.. రాజీ పడటం అనేది క్రమంగా తగ్గుతుంది. అలాగే ఇద్దరి మధ్య విడాకులకు ఇగో కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. నువ్వెంత అంటే నువ్వెంత అన్న రీతిలో ఉన్నప్పుడు సహజంగానే వారి రిలేషన్ షిప్ బ్రేక్ అవుతుంటుంది.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా విడాకులు తీసుకుని కొన్నేళ్ళయ్యింది. హసీన్ జహాన్ ని 2014లో పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ళ క్రితం హసీన్ జహాన్, షమీపై తీవ్ర ఆరోపణలు చేసి విడాకులు తీసుకుంది. అలాగే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నటి నటాషా స్టాంకోవిక్ ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ అగస్త్య అనే కొడుకు ఉన్నాడు. గత ఏడాది వీళ్ళు విడాకులు తీసుకున్నారు. మోడల్ గా, నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటాషా, పాండ్యా విడిపోవడానికి ఇగోనే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. నటాషా కంటే తానే ఎక్కువని హార్దిక్ పాండ్యా భావించడం, గర్వం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం వంటి కారణాల వల్లే ఇద్దరికీ చెడిందని వారి సన్నిహితులు చెబుతున్నారు. చివరికి తప్పని పరిస్థితుల్లోనే వారు విడిపోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.
ఇక మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా తన భార్య ఆయేషాతో విడిపోయాడు. తన ఆస్తిలో వాటా కోసం ఆయేషా ఒత్తిడి చేయడం, కుమారుడిని కలవనివ్వకపోవడం వంటి కారణాలను ధావన్ పిటిషన్ లో పేర్కొన్నాడు. దీంతో న్యాయస్థానం ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. అలాగే సహచర క్రికెటర్ చేసిన ద్రోహంతో వికెట్ కీపర్, దినేష్ కార్తీక్త తన భార్యతో విడిపోవాల్సి వచ్చింది. ఇటీవల మరికొందరు క్రికెటర్లు కూడా విడాకుల బాటలోనే ఉన్నారు. కర్ణాటక బ్యాట్స్ మెన్ మనీష్ పాండే 2019లో ఆశ్రిత శెట్టిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ విడాకుల దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు తీసేశారు. అయితే, అధికారికంగా వీరి నుంచి విడాకులపై ప్రకటన రాలేదు. అలాగే టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ , ధనశ్రీ కూడా విడిపోతున్నట్టు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న వీరి జంట ప్రస్తుతం విడివిడిగా ఉంటోంది. ధనశ్రీ డ్యాన్సర్ గానూ, నటిగానూ రాణిస్తుండగా…ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు సన్నిహిత వర్గాల ద్వారా బయటకు వచ్చింది. మొత్తం మీద క్రికెటర్లుగా అంతర్జాతీయ స్థాయిలో బోలెడంత క్రేజ్ తెచుకున్న స్టార్ ప్లేయర్స్ ఇలా వ్యక్తిగత జీవితాల్లో ఫెయిల్ అవుతుండడం వారి అభిమానులను బాధిస్తోంది.