సియెట్ అవార్డుల్లో భారత్ ఆధిపత్యం కోహ్లీ , రోహిత్ , షమీ లకు పురస్కారాలు
సియెట్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఏడాదిలో అసాధారణ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు, క్రీడా నాయకులకుబిసియెట్ అవార్డులు ఇచ్చి సత్కరించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పలు భారత స్టార్ క్రికెటర్లు అవార్డులు అందుకున్నారు.విరాట్ కోహ్లీకి బెస్ట్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. అతడు 2023లో వన్డేల్లో 1377 రన్స్ చేశాడు. అందులో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ లో 765 రన్స్ తో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు.
అటు కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. అతడు 2023లో అన్ని ఫార్మాట్లు కలిపి 1800 రన్స్ చేశాడు. అందులో వన్డేల్లో 1255 రన్స్ ఉన్నాయి. ఇక మహ్మద్ షమి బెస్ట్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. ఇక బీసీసీఐ సెక్రటరీ జై షా ఉత్తమ క్రీడా పరిపాలకుడిగా ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌కు అత్యుత్తమ కెప్టెన్‌గా అవార్డు దక్కింది.