Shubman Gill: గిల్ దెబ్బకు పాక్ రికార్డులు గల్లంతు
ఐపీఎల్ తర్వాత పేలవ ప్రదర్శనతో విమర్శలకు గురైన టీమిండియా యువ ఓపెనర్ శుభమాన్ గిల్.. వెస్టిండీస్‌తో జరిగిన 3వ వన్డే ద్వారా ఫామ్‌లోకి వచ్చాడు.

Shubman Gill Best Perfomence in West Indies Oneday Series
విండీస్ టీమ్‌పై 200 రన్స్ తేడాతో భారత్ విజయం సాధించిన ఈ మ్యాచ్‌లో గిల్ 85 పరుగులతో చెలరేగాడు. సెంచరీకి 15 పరుగుల దూరంలోనే పెవిలియన్ చేరిన అద్భుతమైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్ తో జరిగిన రెండో వన్ డే ద్వారా తొలి 26వ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ అజామ్ రికార్డ్‌ని బద్దలు కొట్టాడు శుభమాన్. బాబర్ 26 వన్డేల్లో 1322 పరుగులు చేయగా.. శుభమాన్ 1352 పరుగులు చేసి ఆ రికార్డ్‌ను తన సొంతం చేసుకున్నాడు. ఇదే తరహాలో మంగళవారం జరిగిన మూడో వన్ డే మ్యాచ్ తనకి 27 వ మ్యాచ్ కాగా, శుభమాన్.. ఇప్పటివరకు వన్ డేల్లో 1437 పరుగులు చేశాడు. దీంతో 27 వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 1381 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్న ఇమామ్ ఉల్ హక్.. రెండో స్థానానికి పడిపోయాడు.