పొట్ట చుట్టూ పాలిటిక్స్…!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్ట చుట్టూ ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ తిరుగుతున్నాయి.రోహిత్‌పై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శమా అహ్మద్‌...బాడీ షేమింగ్‌ చేశారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2025 | 12:45 PMLast Updated on: Mar 05, 2025 | 12:45 PM

Indian Politics Is Now Revolving Around The Stomach Of Team India Captain Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్ట చుట్టూ ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ తిరుగుతున్నాయి.రోహిత్‌పై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శమా అహ్మద్‌…బాడీ షేమింగ్‌ చేశారు. రోహిత్‌ను కించపరిచేలా కామెంట్స్‌ ఉండటంతో…బీజేపీ విరుచుకుపడింది. రాహుల్‌ గాంధీ క్రికెట్‌ ఆడాలని ఆమె కోరుకుంటున్నారా అంటూ కౌంటర్‌ ఇచ్చింది. శమా అహ్మద్ నీ నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఛాంపియన్స్‌ ట్రోఫీలో న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో…టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ ఆకట్టుకోలేకపోయాడు. 17 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శమా మహమ్మద్‌ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

క్రికెటర్ గా రోహిత్‌ శర్మ ఫిట్‌గా లేడని…అతడు బరువు తగ్గాలని అన్నారు. రోహిత్ కి ఫ్యాట్ ఎక్కువ. అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడు. ఆటగాడిగా ఆయన పనికిరాడు అంటూ శ్యామా చేసిన ట్వీట్ పెద్ద దుమారమే లేపింది. గత కెప్టెన్లతో పోలిస్తే ఏమాత్రం ఆకట్టుకోని కెప్టెన్ రోహిత్‌ శర్మనే అంటూ శమా అహ్మద్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారడంతో వివాదం రాజుకుంది. శమా పోస్టుతో మొదలైన వివాదానికి తృణమూల్ ఎంపీ సౌగత్‌ రాయ్‌ మరింత ఆజ్యం పోశారు. అసలు రోహిత్‌ జట్టులోనే ఉండకూడదన్నాడని వ్యాఖ్యానించారు.
రోహిత్‌ శర్మపై శమా అహ్మద్‌ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది.

ప్రతిపక్ష నేత రాహుల్‌పై కూడా విమర్శలు చేసింది. ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటని…భారత క్రికెట్‌ కెప్టెన్‌నూ వారు వదలట్లేదని బీజేపీ మండిపడింది. రాజకీయాల్లో విఫలమైన వారి నేత రాహుల్‌ గాంధీ… ఇప్పుడు క్రికెట్‌ ఆడాలని వారు కోరుకుంటున్నారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. రాహుల్‌ గాంధీ కెప్టెన్సీలో వారు 90 ఎన్నికల్లో ఓడిపోయారని…ఢిల్లీలో డకౌట్‌ అయ్యారంటూ సెటైర్లు వేసింది. భారత్ కి టీ20 ప్రపంచకప్‌ తెచ్చిన వ్యక్తి కంటే…ఇదే వారికి ఆకట్టుకునే అంశమేమో ? అంటూ విమర్శించింది. భారతీయ సంస్థలు, సాయుధ దళాలను వ్యతిరేకించే…ఆ పార్టీ ఇప్పుడు క్రీడాకారు లని కూడా టార్గెట్ చేస్తోందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌వి ప్రేమ దుకాణాలు కాదని.. విద్వేష కేంద్రాలు అంటూ మండిపడింది బిజెపి.

తన వ్యాఖ్యలు వివాదాస్పద కావడంతో శమా అహ్మద్‌… తన పోస్టును డిలీట్ చేశారు. తన వ్యాఖ్యలపై క్లారిటీ కూడా ఇచ్చారు. తాను కేవలం ఫిట్​నెస్ గురించే మాట్లాడానని…బాడీ షేమింగ్​ గురించి కాదన్నారు. ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, కపిల్‌ దేవ్‌ వంటి గత కెప్టెన్లను రోహిత్‌తో పోలుస్తూ వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో తనకు మాట్లాడే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు.
శమా అహ్మద్‌ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. ఆ పోస్ట్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని శమాను ఆదేశించింది. దేశ క్రీడాకారులను కాంగ్రెస్‌ అత్యున్నతంగా గౌరవిస్తుందని…వారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎలాంటి ప్రకటనలను ఆమోదించబోమని స్పష్టం చేసింది.

శమా అహ్మద్‌ పోస్టుపై బీసీసీఐ పెద్దలు స్పందించారు. కీలక టోర్నీ మధ్యలో ఉన్నప్పుడు…ఇలాంటి కామెంట్లు చేసి ఉండాల్సింది కాదన్నారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. వ్యక్తిగత ప్రచారం కోసమే ఇలాంటివి చేయడం మానుకోవాలని సూచించారు.
కెప్టెన్ రోహిత్ పై కాంగ్రెస్ ప్రతినిధి శ్యామ మహమ్మద్ చేసిన కామెంట్స్ నీ సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ ఎండ కొడుతున్నారు. కాంగ్రెస్కు బాప్ రోహిత్ అన్నా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. శ్యామా మహమ్మద్ కి వ్యతిరేకంగా ఇప్పటికే వాలెట్ ఫీట్లు పడ్డాయి.
రోహిత్ పై షామా చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎండగట్టారు. క్రికెట్ గురించి తెలియని వాళ్లు కూడా ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

ఆటగాళ్లకు ఎమోషన్స్ సెంటిమెంట్లు ఉంటాయని ఇలాంటి కామెంట్స్ ఎంత బాధిస్తాయో తెలుసుకోవాలని చెప్పారు. రోహిత్ అద్భుతమైన ప్లేయర్ అని, గొప్ప కెప్టెన్ అని బజ్జి కొనియాడారు. ఇక యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజు అయితే శామా పై అంత ఎత్తున మండిపడ్డారు. దేశానికి గర్వకారణమైన ఆటగాడిని ఇలాంటి చిల్లర మాటలు అంటావా… నేనే దేశ ప్రధాని అయితే శవాన్ని దేశం నుంచి బహిష్కరించేవాడిని అంటూ చాలా ఆవేశంగా మాట్లాడారు. మొత్తం మీద రోహిత్ పొట్ట ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అయిపోయింది. టీమిండియా కెప్టెన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు .ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా సాధించాలన్న దానిపైనే దృష్టి పెట్టాడు.