IPL T-20: క్యాపిటల్స్ కేరాఫ్ కష్టాలు కన్నీళ్ళు వీళ్ళకు దిక్కెవరు?

ఐ పి ఎల్ 2023 లో అత్యంత స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఏదైనా ఉందని చెప్పుకుంటే, అది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. పృథ్వి షా, డేవిడ్ వార్నర్ లు ఓపెనర్లుగా, మిచెల్ మార్ష్ వన్ డౌన్ బ్యాట్సమెన్ గా, రిలీ రౌస్సౌ, మనీష్ పాండే, రోవ్ మన్ పావెల్, అక్షర్ పటేల్ లు మిడిల్ ఆర్డర్ గా, ఒక డ్రీం టీం గా చెప్పుకోబడ్డ ఢిల్లీ, సరైన ప్లాన్ లేక పాయింట్స్ టేబుల్ చివర్లో చతికిలపడిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2023 | 05:40 PMLast Updated on: Apr 15, 2023 | 5:40 PM

Indian Premier Lague T 20 Match

సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్, అజిత్ అగార్కర్ వంటి లెజెండ్స్ మధ్యన ట్రైన్ అవుతున్న ఢిల్లీ, దారుణ పరాజయాలతో వెనకబడిపోతోంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో డేవిడ్ వార్నర్ ఒక్కడే కన్సిస్టెన్సీగా రన్స్ చేస్తూ, జట్టుకు వెన్నుముఖలా నిలిచాడు. ఢిల్లీ అభిమానుల్ని చిరాకు తెప్పించే ఆటతీరుతో ఓపెనర్ పృథ్వి షా ఔటవుతున్న తీరు నిజంగా ఆ జట్టు మేనేజ్మెంట్ సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే. నాలుగు మ్యాచుల్లో కలిపి పృథ్వి షా అత్యధిక స్కోర్ 15 .

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఓపికను పరీక్ష పెడుతున్న మరో ఆటగాడు రోవ్ మన్ పావెల్. హార్డ్ హిట్టర్ గా పేరున్న పావెల్ కూడా ఢిల్లీకి పెద్దగా చేసిన పరుగులేవి లేవు. వీళ్లకు ఒక రెండు మ్యాచులు బ్రేక్ ఇచ్చి, లోకల్ టేలెంట్ ని ఎందుకు ట్రై చేయకూడదు అనే వాదనా వినిపిస్తుంది. బౌలింగ్ లో కూడా ఢిల్లీ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటూ, ప్రత్యర్థి జట్టు విజయాలను సులువు చేస్తున్నారు. ఈ లోటుపాట్లను దాటితే కానీ, ఢిల్లీ తన తొలి విక్టరీని అందుకోవడం అంత తేలిక కాదు. ప్రతీ మ్యాచులో రాణిస్తున్న పేరే కానీ, వార్నర్ కూడా మరీ వన్ డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ, జట్టు ప్రయోజనాలను పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నాడు. హేమాహేమీలైన కోచులు, మెంటార్లు కలిగి ఉన్న ఢిల్లీ, వ్యూహాలు మార్చకపోతే, సీజన్ చివరివరకు కూడా ఇదే ఎక్స్పీఎరియన్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.