Shami, Suicide : బౌలర్ షమీ ఆత్మహత్యాయత్నం!
ప్రతీ మనిషి జీవితంలో విషాదం ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తే పర్లేదు.. అన్నీ కలిసి ఒకేసారి జీవితం మీద అటాక్ చేస్తే.. దాన్ని మోయడం, భరించడం చాలా కష్టం...

Indian star cricketer, team India bowler Shami suicide attempt!
ప్రతీ మనిషి జీవితంలో విషాదం ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తే పర్లేదు.. అన్నీ కలిసి ఒకేసారి జీవితం మీద అటాక్ చేస్తే.. దాన్ని మోయడం, భరించడం చాలా కష్టం. మానసికంగా చాలా వీక్ అయిపోతుంటారు ఎవరైనా సరే ! బౌలర్ షమీ విషయంలోనూ అదే జరిగింది. 2018.. షమీ జీవితంలో పెను తుఫాన్ తెచ్చింది. భార్య హసీన్ జహాన్ పెట్టిన గృహహింస కేసు, ఫిక్సింగ్ ఆరోపణలు.. కెరీర్‌పరంగా, పర్సనల్‌గా.. అతన్ని కుదిపేశాయ్. ఐతే ఆ తర్వాత కొద్దిరోజులకే ఫిక్సింగ్ ఆరోపణల నుంచి బయటపడ్డాడు.
ఆ సమయంలో షమీ ఎంతో మనోవేదనకు గురయ్యాడట. దేశానికి ద్రోహం చేశాననే ఆరోపణలను సహించలేని షమీ.. ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని షమీ స్నేహితుడు ఉమేశ్ కుమార్ చెప్పాడు. 2018లో షమీని ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయని.. ఆ సమయంలో తమ ఇంట్లోనే ఉన్నాడని.. ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఎంతో కుమిలిపోయాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఉమేష్.
ఏదో కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నాడని తనకు అర్థమైందని.. ఓ రోజు తెల్లవారుజామున 4గంటలకు మంచి నీళ్లు తాగడానికి గదిలోంచి బయటకు వచ్చి.. 19వ అంతస్తులో ఉన్న తమ ఇంటి బాల్కనీలో ఉన్నాడని.. ఏం జరగబోతుందో తనకు అర్థమైందని.. వెంటనే లోపలికి తీసుకెళ్లానని అంటూ ఆ రాత్రిని గుర్తుచేసుకొని.. ఎమోషనల్ అయ్యాడు ఉమేష్. ఫిక్సింగ్ ఆరోపణల నుంచి క్లీన్‌చిటవ్ వచ్చాక.. షమీ చాలా ఆనందపడ్డాడని.. ప్రపంచకప్ గెలిచిన దానికంటే ఎక్కువ సంతోషించాడని చెప్పాడు. ఆ తర్వాత పూర్తిగా కెరీర్‌పై దృష్టి పెట్టాడని అన్నారు. ఇక ఆ తర్వాత షమీ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2023 వన్డే వాల్డ్‌కప్‌లో అదరగొట్టాడు. మెగా టోర్నీ తర్వాత చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ.. ఐపీఎల్ 2024, టీ20 ప్రపంచకప్ 2024కు దూరమయ్యాడు.