కంగారూలతో పింక్ బాల్ టెస్ట్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఈ ఏడాది టీమిండియా పలు కీలక సిరీస్ లు ఆడనుంది. నవంబర్‌లో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుండటం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కాగా ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఇరు జట్లు పింక్‌బాల్ టెస్టులో తలపడనున్నాయి. ఈ డే-నైట్ టెస్ట్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పింక్-బాల్ టెస్ట్‌కు ముందు రెండు రోజుల డే-నైట్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్లాన్ చేసింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ భారత జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది. 2020-21 టూర్ డే-నైట్ టెస్ట్‌లో భారత్ ఘోర పరాభావాన్ని చవిచూసింది.