Manu Bhaker : శెభాష్ మను.. యువ షూటర్ పై ప్రశంసల జల్లు

పారిస్ ఒలింపిక్స్ (paris olympics) లో కాంస్యం (bronze) గెలిచిన భారత మహిళా షూటర్ (Indian women shooter) మను బాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 29, 2024 | 01:55 PMLast Updated on: Jul 29, 2024 | 1:55 PM

Indian Womens Shooter Manu Bakar Who Won Bronze In The Paris Olympics Is Showered With Praise

 

 

పారిస్ ఒలింపిక్స్ (paris olympics) లో కాంస్యం (bronze) గెలిచిన భారత మహిళా షూటర్ (Indian women shooter) మను బాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మహిళల 10మీ ఎయిర్‌ పిస్టల్‌ (air pistol) లో భారత్ కు తొలి ఒలింపిక్ మెడల్ అందించడం ద్వారా మను చరిత్ర సృష్టించింది. రాష్ట్రపతి, ప్రధానితో సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెను అభినందించారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి దేశం కీర్తిని చాటిన మను భాకర్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందనలు తెలిపారు. ఆమెను చూసి దేశం గర్వపడుతోందన్నారు. మను సాధించిన ఈ విజయం ఎంతోమంది క్రీడాకారులు, మరీ ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

అలాగే ప్రధాని మోదీ కూడా మను భాకర్‌ను అభినందించారు. షూటింగ్‌లో భారత్‌ తరఫున కాంస్య పతకం సాధించడంతో పాటు ఈ ఘనత అందుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించడం మరో ప్రత్యేకత అన్నారు. ఇదో అపురూపమైన విజయమని మోదీ కితాబిచ్చారు. ఇక భారత క్రికెటర్లు (Indian cricketers), ఇతర స్పోర్ట్స్ సెలబ్రిటీలు సైతం మను బాకర్ ను అభినందిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. మను ఇచ్చిన స్ఫూర్తితో పారిస్ ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.