భారత్ చేతిలో ఓటమి బంగ్లా కోచ్ పై వేటు
టీమిండియా చేతిలో ఘోరపరాభవం నేపథ్యంలో బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చందిక హతురుసింఘేపై వేటు పడింది. తక్షణమే హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అతన్ని ఆదేశించింది.
టీమిండియా చేతిలో ఘోరపరాభవం నేపథ్యంలో బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చందిక హతురుసింఘేపై వేటు పడింది. తక్షణమే హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అతన్ని ఆదేశించింది. హతురుసింఘే స్థానంలో విండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఫిల్ సిమన్స్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు. సిమన్స్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఈ పదవిలో కొనసాగుతాడు. శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ అయిన హతురుసింఘే రెండు సార్లు బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2014-17 , 2023-2024 అక్టోబర్ మధ్యలో బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. కొత్త కోచ్ సిమన్స్ త్వరలో జరుగబోయే సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి బాధ్యతలు చేపడతాడు.